వీరు విమాన ప్రయాణికులేనా?.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర

Published on Sat, 07/15/2023 - 08:55

విమాన ప్రయాణాల్లో అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరుచూ నమోదవుతున్నాయి. కొందరు అభ్యంతరకరంగా ప్రవరిస్తూ తోటి ప్రయాణికులను, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. 

మరో ప్రయాణికునికి కేటాయించిన సీటులో కూర్చుని..
ఇటీవల టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు హంగామా సృష్టించాడు. నేపాల్‌కు చెందిన మహేశ్ పండిట్‌ అనే ‍ప్రయాణికుడు విమాన సిబ్బందిని తీవ్రంగా దూషించడంతోపాటు లావేటరీ డోర్‌ను ధ్వంసం చేసి, నానా రభస చేశాడు. తనకు కేటాయించిన సీటులో కాకుండా వేరే సీటులో కూర్చుని ఆ ప్రయాణికునితో మహేష్‌ పండిట్‌ గొడవపడ్డాడు. ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎయిర్‌ హోస్టెస్‌ను అసభ్యంగా తాకి..
గత ఏప్రిల్‌లో బ్యాంకాక్‌ నుంచి ముంబాయికి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో పాటు ప్రయాణికులతో అమర్యాదకరంగా ప్రవర్తించాడు. విమానంలో ఆహారం అందుబాటులో లేదని ఎయిర్‌హోస్టెస్‌ చెప్పడంతో ఒక ప్రయాణికుడు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంతసేపటి తరువాత ఆమె అందించిన చికెన్‌ డిష్‌ తీసుకునేందుకు అంగీకరిస్తూ, కార్డు స్వైపింగ్‌ పేరుతో ఆమెను అసభ్యంగా తాకాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్య​క్తం చేయగా, మరింత రెచ్చిపోతూ అందరిముందు వేధించాడు. ఈ ఘటనపై సదరు ఎయిర్‌హోస్టెస్‌ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సీటు పక్కనే వాంతి చేసుకోవడంతో పాటు..
కొద్దిరోజుల క్రితం ఎయిర్‌ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు ముత్ర విసర్జన చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. గువాహటి నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో తన సీటు పక్కన వాంతి చేసుకున్నాడు. అంతటితో ఆగక టాయిలెట్‌ బయట మలవిసర్జన చేశాడు. ఫలితంగా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

కుక్క పిల్లను ఒడిలో పెట్టుకోవద్దనడంతో..
గత ఏడాది అట్లాంటా విమానాశ్రయంలో న్యూయార్క్ వెళ్లే విమానంలో ‍ప్రయాణించిన ఒక మహిళా ప్రయాణికురాలు తన వెంట ఒక కుక్క పిల్లను తెచ్చుకుంది. ట్రావెల్‌ కేజ్‌లో ఉంచాల్సిన ఆ కుక్క పిల్లను తన ఒడిలో ఉంచుకొని కూర్చుంది. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఆ కుక్క పిల్లను కేజ్‌లో ఉంచాలని చెప్పడంతో, ఆగ్రహించిన ఆ మహిళ విమాన సిబ్బందిని తిట్టడంతోపాటు నానా హంగామా చేసింది.  ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా వెంటనే విమానం దిగాలని చెప్పిన ఒక ప్రయాణికుడిపై వాటర్‌ బాటిల్‌ విసిరింది. అయితే చివరకు ఆ మహిళను విమాన సిబ్బంది కిందకు దించారు. ఈ విషయాన్ని అట్లాంటా పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. 

గణిత సమీకరణాన్ని పరిష్కరిస్తూ..
ఆ మధ్య అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. విమానంలో గణిత సమీకరణాన్ని పరిష్కరించే విషయంలో తోటి ‍ప్రయాణికుడు అనుమానంగా ప్రవర్తిస్తున్నాడని, విదేశీ స్క్రిప్ట్‌లో రాస్తున్నాడని ఒక మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ ప్రయాణికుడి కారణంగా తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొంది. ఇందుకు కారకుడైన ప్రొఫెసర్ గైడో మెన్జియోను అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రాంతీయ విమానం టేకాఫ్ చేయడానికి ముందు ప్రశ్నించింది. అసలు విషయం వెల్లడి కావడంతో ఆమెను ప్రత్యేక విమానంలో ఆమె చేరాల్సిన గమ్యస్థానానికి తరలించారు.
ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)