Breaking News

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం

Published on Tue, 08/29/2023 - 14:34

ఇస్లామాబాద్: తోషఖానా అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది ఇస్లామాబాద్ హైకోర్టు. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ళ జైలు శిక్షను నిలిపివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. 

తోషఖానా అవినీతి కేసులో ట్రయల్ కోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అమిర్ ఫరూఖ్, న్యాయమూర్తి తరీఖ్ మహమూద్ జహంగిరిలతో కూడిన డివిజన్ బెంచ్ తోషఖానా కేసులో ఉత్కంఠతకు తెరదించుతూ సంచలనాత్మక తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌కు విధించిన మూడేళ్ళ జైలుశిక్షను నిలిపివేసింది. 

2018 నుండి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్‌పై దేశ సంపదను అక్రమంగా అమ్ముకున్నారన్న నేరంపై పంజాబ్‌ ప్రావిన్స్‌లోని అటక్‌ జిల్లా జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఇదే కేసులో మరో ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా వీల్లేదని తెలుపుతూ ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ హైకోర్టు ఆ తీర్పును నిలిపివేయడంతో ఇమ్రాన్ ఖాన్‌కు ఉపశమనం లభించినట్లయింది. 

ఇది కూడా చదవండి: అమెరికా పర్యటనలో కేటీఆర్‌...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)