Breaking News

దయనీయంగా పాక్‌ పరి​స్థితి.. బాంబు పేల్చిన ఐఎంఎఫ్, ఇప్పట్లో కష్టమే!

Published on Wed, 07/19/2023 - 18:46

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్ధిక స్థితిగతులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 120 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ అప్పులతో ఏదో ఒక విధంగా నెట్టుకొస్తుంది కానీ భవిష్యత్తులో వారికి మరిన్ని కష్టాలు తప్పవని తేటతెల్లం చేసింది.  

ఇప్పటికే పాకిస్తాన్ దేశం ఎక్కడెక్కడో ఉన్న వారి ఆస్తులను అమ్ముకుని నిలదొక్కుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో వాషింగ్టన్ లోని వారి ఎంబసీ భవనాన్ని అమ్మకానికి పెట్టింది.  అలాగే కరాచీ, లాహోర్ విమానాశ్రయాలను కూడా లీజుకు ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ఇస్లామాబాద్ విమానాశ్రయాన్నైతే ఇప్పటికే అవుట్సోర్సింగ్ కు ఇచ్చేసింది. 

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఆర్థిక సహాయం కోరిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ కొంత నిధులను సమకూర్చినా కూడా పాకిస్తాన్ వారి ప్రస్తుత సంక్షోభం నుండి బయటపడాలంటే మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది ఐఎంఎఫ్.

పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ తోనూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ తోనూ ఆర్థిక ద్రవ్య విధానాలపై వారు చేసిన ఒప్పందం ఆధారంగా నివేదిక తయారుచేశామని ఐఎంఎఫ్ ఈ నివేదికను వెల్లడించింది. 

ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రస్తుత అంతర్గత విధానాలు, దీర్ఘకాలిక చెల్లింపులు దృష్ట్యా వెలుపల నుండి సహకారం అందిస్తున్నవారు మరికొంత కాలం పాక్ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరముందని తెలిపింది ఐఎంఎఫ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్ ఈ సంక్షోభం నుండి గట్టెక్కడం కష్టమని నివేదికలో చెప్పకనే చెప్పింది.     

మరోపక్క పెరుగుతోన్న నిత్యావసర వస్తువుల ధరలకు తాళలేక పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. వీటితోపాటు ఇటీవలే యూనిట్ పై ఐదు పాకిస్తాన్ రూపాయల విద్యుత్ చార్జీలు, గ్యాస్ చార్జీలు 40% కూడా పెరగడంతో దిక్కుతోచని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతున్నారు. 

ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)