Breaking News

పాక్‌కు బిలియన్‌ డాలర్లు 

Published on Sat, 05/10/2025 - 02:23

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి తనకు 100 కోట్ల డాలర్లు మంజూరైనట్టు పాకిస్తాన్‌ పేర్కొంది. పాక్‌ ప్రధాని కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటి ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు భేటీలో ఇందుకు ఆమోదముద్ర పడ్డట్టు పేర్కొంది. ఇది పాక్‌కు 700 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్‌ రుణ ప్యాకేజీలో భాగం. ఈ మొత్తాన్ని మూడేళ్ల వ్యవధిలో ఇచ్చేందుకు గత జూలైలో ఐఎంఎఫ్‌ అంగీకరించింది. 

రుణ వాయిదాల వినియోగాన్ని ఆర్నెల్లకోసారి సమీక్షిస్తూ ఏడు వాయిదాల్లో రుణాన్ని అందజేస్తామని పేర్కొంది. తొలి వాయిదాగా గతంలోనే 100 కోట్ల డాలర్లు అందజేసింది. ఈ రుణంపై భారత్‌ తొలినుంచీ తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చుతూ వస్తోంది. ‘‘ఈ నిధులను పాక్‌ ప్రధానంగా ఉగ్రవాద కార్యకలాపాలపైనే వెచ్చిస్తుంది. అంతిమంగా ఇది భారత్‌కే గాక అంతర్జాతీయ సమాజానికే పెనుముప్పుగా పరిణమిస్తుంది. 

కనుక పాక్‌కు రుణసాయాన్ని పూర్తిగా నిలిపేయాలి’’అని కోరుతూ వస్తోంది. పాక్‌కు 100 కోట్ల డాలర్ల విడుదల ప్రతిపాదనను శుక్రవారం నాటి ఐఎంఎఫ్‌ బోర్డు భేటీలో భారత్‌ వ్యతిరేకించింది. దానిపై జరిగిన ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. 

‘‘పాక్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని ప్రచారం చేసుకుంటున్న మోదీ ప్రభుత్వం ఓటింగ్‌కు దూరంగా ఎందుకు ఉన్నట్టు? అలాగాక వ్యతిరేకంగా ఓటేస్తే మన వైఖరిని సమర్థంగా వినిపించినట్టుగా ఉండేది’’అంటూ ఆక్షేపించింది. దివాలా స్థితిలో ఉన్న పాక్‌ను చైనా, సౌదీ అరేబియా, ఖతార్‌తో పాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్‌లే ఆర్థికంగా ఆదుకుంటూ వస్తున్నాయి. 2024 నాటికి పాక్‌ విదేశీ రుణభారం 130 బిలియన్‌ డాలర్లు దాటింది.  
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)