Breaking News

ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Tue, 06/16/2026 - 04:53

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.

తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ (MAGA)ను ప్రస్తావించారు.

కాగా, ట్రంప్‌ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఇటీవల హెచ్‌-1బీ వీసాలకు  లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్‌ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.

దీనిపై స్పందించిన ట్రంప్‌, ఫెడరల్‌ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.

మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.

ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్‌మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)