Breaking News

హిజ్బుల్లా స్థావరాలపై ఐడీఎఫ్‌ దాడులు

Published on Mon, 02/02/2026 - 19:33

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హెజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలపై  దాడులు జరిపింది.ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను మళ్లీ పుంజుకునేలా చేస్తోందన్న సమాచారంతో ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడులు నిర్వహించింది.  హిజ్బుల్లా కార్యకర్తలు ఇజ్రాయెల్ భూభాగం వైపు ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను ప్రయోగించడానికి ఉపయోగించిన అల్-ఖియామ్ సమీపంలోని ఒక నిర్మాణాన్ని కూడా సైనికులు కూల్చివేసినట్లు సైన్యం తెలిపింది.

దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లా (Hezbollah) చెందిన ఆయుధ నిల్వ గిడ్డంగులను లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేసింది. ఈ దాడులకు ముందు, పౌరులకు ఎలాంటి హాని కలగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు, వాటిలో ఆ ప్రాంతంలోని జనాభాకు ముందస్తు ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ఆయుధ కేంద్రాలలో ఒకటి జనసంచారం ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాల మధ్యలో ఉంది. లెబనాన్ పౌరులను హిజ్బుల్లా 'మానవ కవచాలు' (Human Shields) వాడు కుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాల నుండి కార్యకలాపాలను కొనసాగిస్తోంది అనడానికి ఇదొక ఉదారణ అని పేర్కొంది. ఈ ఆయుధ కేంద్రాలు ఇజ్రాయెల్ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తాయని, అందుకే వాటిని తొలగించడం తప్పనిసరి అని IDF స్పష్టం చేసింది.

కాగా ఈ దాడులు కేవలం ఆకస్మికమైనవి కావు, దీని వెనుక కీలకమైన కారణాలు లేకపోలేదు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా ఎటువంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించ కూడదు. కానీ హిజ్బుల్లా మళ్లీ అక్కడ స్థావరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ చెబుతోంది.  

ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన ప్రకారం, తమ దేశానికి ముప్పు పొంచి ఉన్నంత కాలం లెబనాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా కార్యకలాపాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. హెజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను పౌర గృహాల కింద, స్కూళ్ల సమీపంలో నిర్మించడం అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ విమర్శించింది. ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)