Breaking News

హెజ్‌బొల్లా టన్నెల్‌ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్‌

Published on Wed, 10/16/2024 - 10:47

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా,  ఇజ్రాయెల్‌ ఆర్మీ మధ్య దాడులు, ప్రతిదాడుల ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా  హెజ్‌బొల్లా గ్రూప్‌ సభ్యులు ఉపయోగించిన ఓ రహస్య టన్నెల్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో.. హెజ్‌బొల్లా టన్నెల్‌కు సంబంధించి ఇనుప తలుపులు, ఫంక్షన్‌ రూమ్‌లు, ఏకే 47 రైఫిళ్లు, బెడ్రూం, బాత్రూం, స్టోర్‌ రూం, జనరేటర్‌, వాటర్‌ ట్యాంక్‌, ద్విచక్ర వాహనాలు కనిపిస్తున్నాయి. 

దక్షిణ లెబనాన్‌లో వంద మీటర్ల మేర  ఉన్న ఈ సొరంగంలో హెజ్‌బొల్లా సామగ్రి దృష్యాలను ఇజ్రాయెల్‌  ఆర్మీ చూపించింది. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారనే విషయంపై ఇజ్రాయెల్‌  ఆర్మీ స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.

 

‘‘దక్షిణ లెబనాన్‌లోని గ్రామాల్లో హెజ్‌బొల్లా గ్రూప్‌ ఏం చేస్తోందో చూడడానికి మేము సరిహద్దును దాటి అక్కడి వెళ్తున్నాం. ఉత్తర ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7 హమాస్‌ తరహా దాడికి హెజ్‌బొల్లా టన్నెల్‌ను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది’’ అని వీడియో ఓ ఇజ్రాయెల్ సైనికుడు మాట్లాడటం వినవచ్చు.

ఇక.. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన తనంతరం గాజాపై ఇజ్రయెల్‌ సైన్యం భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా తమ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. ఇక.. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌.. సరిహద్దుల్లో వాటి స్థావరాలపై దాడులు కొనసాగిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)