Breaking News

స్పెల్లింగ్‌ బీ విజేత హైదరాబాదీ

Published on Sat, 05/31/2025 - 05:37

ఓక్సన్‌ హిల్‌ (అమెరికా): హైదరాబాద్‌కు చెందిన ఫైజన్‌ జకీ అనే 13 ఏళ్ల బాలుడు అమెరికా జాతీయ స్పెల్లింగ్‌ బీ (Spelling Bee) చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో జకీతో పోటీపడ్డ మరో ఇద్దరు చిన్నారులు సర్వజ్ఞ కదం, సర్వ్‌ ధరవనెవి కూడా భారత మూలాలే కావడం విశేషం. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో వారిద్దరినీ జకీ అలవోకగా ఓడించాడు. తద్వారా గతేడాది వెంట్రుకవాసిలో తప్పిపోయిన స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ చాంపియన్‌షిప్‌ను ఈసారి సగర్వంగా సాధించాడు. 

రెండో స్థానంలో నిలిచిన 14 ఏళ్ల కదం కాలిఫోర్నియావాసి. కాగా మూడో స్థానంలో నిలిచిన సర్వ్‌ వయసు కేవలం 11 ఏళ్లే.జార్జియాకు చెందిన అతనికి మరో మూడేళ్లు పోటీల్లో పాల్గొనే అవకాశముంది. అత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్‌ బీ పోటీలకు ఇది 100వ ఏడాది కావడం విశేషం. ఈసారి పోటీ 21 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగింది. 18వ రౌండ్లోనే జకీకి గెలిచేందుకు సువర్ణావకాశం వచ్చిది. కదం, సర్వ్‌ వరుసగా రెండు స్పెలింగులు తప్పు చెప్పారు. కానీ జకీ కూడా తనకిచ్చిన పదం తాలూకు వివరణ కూడా వినకుండానే బదులిచ్చేందుకు తొందరపడ్డాడు. కానీ తొలి అక్షరమే తప్పుగా చెప్పాడు. అయినా నిరాశ పడకుండా మరో మూడు రౌండ్ల తర్వాత ‘ఎక్లెయిర్‌సిస్‌మెంట్‌’ పదం స్పెలింగ్‌ సరిగా చెప్పడం ద్వారా విజయపతాక ఎగురవేశాడు. ఆ వెంటనే ఆనందం పట్టలేక వేదికపై కుప్పకూలిపోయాడు.

‘‘గెలుస్తానని అనుకోలేదు. ఈ అనూభూతిని వర్ణించేందుకు మాటల్లేవు’’ అంటూ సంబరపడిపోయాడు. జకీ కొంతకాలంగా ఫ్రెంచ్‌ నేర్చుకుంటున్నాడు. దాంతో ఫ్రెంచ్‌ మూలాలున్న ‘ఎక్లెయిర్‌సిస్‌మెంట్‌’ స్పెల్లింగ్‌ చెప్పడం సులువుగా మారింది. ప్రైజ్‌మనీ (Prize Money) కింద అతనికి 50 వేల డాలర్లు (దాదాపు రూ.42 లక్షలు) లభించాయి. అందులో అధిక మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని జకీ ప్రకటించాడు. ఈసారి తుది రౌండ్లకు అర్హత సాధించిన చిన్నారుల్లో మరో నలుగురు భారతీయులుండటం విశేషం. 

గతేడాది రన్నరప్‌ 
స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పాల్గొనడం జకీకి ఇది నాలుగోసారి. ఇందుకోసం ఏడేళ్ల వయసు నుంచే కఠోరంగా సాధన చేస్తూ వచ్చాడు. 2019లో ఏడేళ్ల వయసులోనే తొలిసారి పోటీల్లో పాల్గొన్నా 370వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2023లో రెండోసారి సెమీస్‌ దాకా చేరి 21వ స్థానంలో నిలిచాడు. 2024లో మాత్రం ఒక్క స్పెల్లింగ్‌ కూడా తప్పు చెప్పకుండా ఫైనల్‌ రౌండ్‌ దాకా దూసుకెళ్లాడు. అక్కడ తాను సాధన చేయని లైటెనింగ్‌ రౌండ్‌ ఎదురైంది. అయినా హోరాహోరీ తలపడి టై బ్రేకర్‌ దాకా తీసుకెళ్లినా చివరికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

చ‌ద‌వండి: మిస్ యూఎస్ఏ తెలుగు టాలెంటెడ్‌గా పోల‌వ‌రం యువ‌తి

అతనిపై నెగ్గిన బృహత్‌ సోమవి కూడా భారత మూలాలే. ఈసారి టైటిల్‌ సాధనలో జకీకి అతను అండదండగా నిలిచాడు. జకీ కుటుంబం టెక్సాస్‌లో డాలస్‌లోని అలెన్‌లో నివసిస్తోంది. స్థానిక సీఎం రైస్‌ మిడిల్‌ స్కూల్లో అతను సెవెన్త్‌ గ్రేడ్‌ చదువుతున్నాడు. ‘‘మావాడు రెండేళ్లకే చదవడం మొదలు పెట్టాడు. చూస్తుండగానే ఇంగ్లిష్‌ డిక్షనరీ మొత్తాన్నీ బట్టీ పట్టేశాడు’’ అని జకీ తల్లిదండ్రులు అర్షియా, అన్వర్‌ ఆనందంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడిక మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌ (maths olympiad) తన తదుపరి లక్ష్యమని వివరించారు. జకీ తాత, నానమ్మ కూడా హైదరాబాద్‌ (Hyderabad) నుంచి ఫైనల్‌ను ఆసాంతం వీక్షించారు. 

మనోళ్లదే హవా 
అమెరికా జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో ఏళ్ల తరబడి భారత సంతతి బాలలే ఆధిపత్యం చలాయిస్తున్నారు. గత 36 పోటీల్లో ఏకంగా 30 సార్లు విజేతలుగా నిలిచి సత్తా చాటారు.   

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)