Breaking News

Donald Trump: అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు

Published on Wed, 04/05/2023 - 07:42

ఫ్లోరిడా: క్రిమినల్‌ అభియోగాలు ఎదుర్కోవడమే కాదు.. కోర్టు విచారణకు హాజరయ్యే క్రమంలో అరెస్టయిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రకెక్కారు. అయితే కోర్టు విచారణ అనంతరం ఈ కేసుపై మీడియాతో మొదటిసారిగా మాట్లాడిన ట్రంప్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు.  బైడెన్‌ పాలనలో అమెరికా నానాటికీ నాశనం అవుతోందంటూ మండిపడ్డారాయన. 

శృంగార తారతో అనైతిక ఒప్పందం కేసులో ఆయన కోర్టులో లొంగిపోయేందుకు వెళ్లగా.. పోలీసులు అరెస్ట్‌ చేసి మరీ కోర్టులో హాజరు పరిచారు. తానే నేరమూ చేయలేదని ట్రంప్‌ వాదనలు వినిపించినట్లు తెలుస్తోంది. న్యూయార్క్‌ మాన్‌హట్టన్‌ కోర్టులో సుమారు గంటపాటు విచారణ జరిగిన తర్వాత.. ట్రంప్‌ నేరుగా ఫ్లోరిడాలోని మార్‌ ఏ లాగో ఇంటికి వెళ్లిపోయారు.  అయితే కాసేపటికే ఆయన మీడియాతో మాట్లాడారు. 

అమెరికాలో ఇలాంటివి జరుగుతాయని ఏనాడూ ఊహించలేదు. ఇలా జరగాలని కోరుకోవడం లేదు కూడా. నేను చేసిన నేరమల్లా ఒక్కటే. దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న శక్తులకు ధైర్యంగా ఎదురొడ్డి పోరాడడమే అని ట్రంప్‌అన్నారు. 

అమెరికా నరకంగా మారి నాశనం వైపు అడుగులేస్తోందని, అది చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందని ట్రంప్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తనపై ఈ కుట్ర జరుగుతోందని, దానిని ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసంటూ ఈ రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో తదుపరి విచారణ కోసం ట్రంప్‌ డిసెంబర్‌లో మళ్లీ కోర్టు ఎదుట హాజరు కావొచ్చని తెలుస్తోంది. 

మిస్టర్‌ ట్రంప్‌.. యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)