రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు

Published on Sat, 06/20/2026 - 12:11

ప్రజాధనాన్ని అప్పనంగా కొట్టేసేందుకు మెక్సికోకు చెందిన ఒక మహిళా మేయర్ నాన్సీ నాపోలెస్ (Nancy Nápoles) కిడ్నాప్ నాటకం సంచలనం రేపుతోంది. పబ్లిక్ ఫండ్స్ నుండి మిలియన్ల కొద్దీ డాలర్లను(రూ.18 కోట్లకు పైగా)  మళ్లించడానికి తానే స్వయంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా, జూలై 9న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని అధికారులు ఆమెను కోరారు.

అసలేంటీ ఆరోపణలు 
అధికారులు వాదన ప్రకారం మెక్సికో స్టేట్‌లోని ‘టెనాన్సింగో’ మున్సిపల్ ప్రెసిడెంట్ మోరెనా (Morena) పార్టీ సభ్యురాలు నాపోలెస్‌ఉ ఇటీవల కొందరు దుండగులు ఆమెను తుపాకీతో బెదిరించి అపహరించినట్టు, అనంతరం కిడ్నాపర్లు ఆమె విడుదల కోసం 2.3 మిలియన్‌ డాలర్లు (రూ.18 కోట్లకు పైగా) డిమాండ్‌ చేసినట్లు వెల్లడైంది. డబ్బు చెల్లించకపోతే మేయర్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేస్తామని బెదిరించారు అయితే మేయర్‌ను బలవంతంగా కారులోకి ఎక్కిస్తుండగా చూసిన ఒక సాక్షి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ప్లాన్‌ బెడిసికొట్టింది. దర్యాప్తులో అనేక పొంతన లేని విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసుపై అనుమానాలు మొదలయ్యాయి. 

ఇదీ చదవండి: కోవిడ్‌-19 : బాంబు పేల్చిన తులసి గబ్బార్డ్‌

దర్యాప్తులో అనుమానాలు
ఇప్పటికే అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా ఈ విచారణసాగుతోంది. భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేసిన కిడ్నాపర్లు, ఆ తరువాత జరిగిన దర్యాప్తులో సమాధానాలు  చెప్పడంలో  తడబడడంతో ఇది నకిలీ కిడ్నాప్ పథకమని అనుమానించారు. ప్రజాధనం దుర్విని యోగాన్ని కప్పిపుచ్చడానికే ఈ డ్రామా అని అధికారులు వాదిస్తున్నారు. ఈ ప్లాన్ వెనుక నాపోలెస్ భర్త, ఆమె బావ (లేదా మరిది) కీలక పాత్ర పోషించారని, అప్పటికే దారిమళ్లించిన డబ్బుకు ఒక కారణంగా చూపడానికే ఈ నాటకం ఆడారని ఆరోపిస్తున్నారు.

ఇది రాజకీయ కుట్ర
నిందితురాలు, మెక్సికో స్టేట్‌లోని ‘టెనాన్సింగో’ మున్సిపల్ ప్రెసిడెంట్, అధికారిక 'మొరెనా' పార్టీ సభ్యురాలైన నాన్సీ నాపోలెస్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తానే తప్పు చేయలేదని వాదించారు. అన్నింటికీ సమాధానం చెబుతానన్నారు. అసలైన దోషులకు శిక్ష పడాలన్నారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని ఆమె  కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో... తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి సహాయం చేస్తానని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

స్టేట్ ప్రాసిక్యూటర్ ఆఫీస్ ప్రకటన
ఈ కేసులో కార్లా వలేరియా, విక్టర్ మాన్యుయెల్, క్రిస్టియన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు.  మే 31న జరిగిన టెనాన్సింగో మున్సిపల్ ప్రెసిడెంట్ (N.N.P.) 'కిడ్నాప్ వ్యవహారంలో ఒక ప్రభుత్వ అధికారిపై అభియోగాలు మోపడానికి అనుమతి కోరాం. అలాగే పరారీలో ఉన్న మరో ఇద్దరు పురుషుల కోసం వారెంట్ జారీ చేశామన్నారు. మేయర్ నాన్సీ నాపోలెస్‌పై ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ జారీ కాలేదు. మెక్సికోలో ప్రస్తుతం ప్రెసిడెంట్ క్లాడియా షీన్‌బామ్ ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో, అధికార పార్టీకి చెందిన మేయర్ చుట్టూ తిరుగుతున్న ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతోంది.

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)