Breaking News

ఇజ్రాయెల్-గాజా యుద్ధం: హౌతీ నేత కీలక వ్యాఖ్యలు

Published on Tue, 01/09/2024 - 14:08

ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం కొనసాగుతోంది. గాజాలోని హమాస్‌ సాయుధులను అంతం చేసేవరకు తమ దాడులు ఆపమని ఇజ్రాయెల్‌ దళాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యెమెన్ హౌతీ ఉద్యమ నేత మహమ్మద్ అలీ అల్ హౌతీ  కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌- గాజా యుద్ధంలో తమ ప్రమేయాన్ని సమర్థించుకున్నారు. అయితే తాము పాలస్తీనాకు బహిరంగంగా ఎప్పుడూ మద్దతు తెలపలేదని అన్నారు. కానీ,  పాలస్తీనియన్లు వాళ్ల పని వారు చేస్తూ వెళ్తారని చెప్పారు. 

మైళ్ల దూరంలో తనకు ఈ యుద్ధంలో ప్రమేయముందా అని అడిగినప్పడూ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌.. నెతన్యాహుకు పొరుగువాడా?, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఒకే అంతస్తులో నివసిస్తున్నాడా? బ్రిటన్‌ ప్రధాని ఒకే భవనంలో ఉంటున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ దాడులతో తాము ఏం సాధించలేదని, అటువంటి సమయంలో అమెరికా తమని ఎందుకు వ్యతిరేక కూటమిగా భావిస్తోందని మండిపడ్డారు. ఇజ్రాయెల్‌ పోర్టుల్లో ఏం జరుగుతుందో వారే స్వయంగా చెబుతున్నారని అన్నారు. దీంతో తమ చర్యలు ఎంత ప్రభావితంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. 

ఎవరు ఏం చేసినా తమ ప్రాభల్యాన్ని తిరిగి పొందాలనుకుంటున్నామని అన్నారు. తమకు చట్టబద్దత లేదని ఎవరు అ‍న్నా పట్టించుకోమని తెలిపారు. నిజంగానే తమకు చట్టబద్దత లేకపోతే బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, యుఎఇతో సహా 17 దేశాలను ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమకు యెమెన్ ప్రజలే అండగా ఉంటారని తెలిపారు. అదేవిధంగా తాము ఇజ్రాయెల్‌ హింసాత్మాక దాడులను ఎదుర్కొగలమని తెలిపారు. యెమెన్‌లోని ఇరాన్‌ అనుబంధ హౌతి సాయుధ గ్రూపు​ నవంబర్ 19 నుంచి సుమారు 20 కంటే ఎక్కువ నౌకలపై డ్రోన్‌లు, క్షిపణులను ప్రయోగించిన విషయం తెలిసిందే. గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీలు ఈ దాడులకు తెగపడుతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: Israel-Hamas War: ఫౌదా సిరీస్ నటుడికి తీవ్ర గాయాలు

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)