Breaking News

ఎప్‌స్టీన్ ఫైల్స్ చరిత్ర ఇదే..!

Published on Fri, 02/06/2026 - 21:41

అమెరికాలో జెఫ్రీ ఎప్‌స్టీన్ పేరు మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం జైలు గదిలో అతను ఆత్మహత్య చేసుకున్నా… అతని చుట్టూ తిరిగిన రహస్యాల కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న “ఎప్స్టీన్ ఫైళ్లు” ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.

జెఫ్రీ ఎప్‌స్టీన్ రాజకీయ నాయకుడు కాదు. సినీ తార కూడా కాదు. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతుల మధ్య తిరిగిన వ్యక్తి. అపర కుబేరుడైన ఎప్‌స్టీన్

అతనికి  సొంతంగా ఉన్న లిటిల్ సెయింట్ జేమ్స్ అనే చిన్న దీవిని తమ కామ క్రీడలకు అడ్డాగా మార్చుకున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలపై లైంగిక దోపిడి జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథలు దాదాపు ఒకేలా ఉన్నాయి — చిన్న ఉద్యోగ ఆఫర్లు, ఆకర్షణలు, తర్వాత బెదిరింపులు. లోపల జరిగినవి బయటకు చెప్పాలంటే చంపేస్తామని హెచ్చరికలు.

ఎప్‌స్టీన్ ఒంటరిగా ఇదంతా చేయలేడని చాలా మంది నమ్ముతున్నారు. అతని వెనుక ఒక వ్యవస్థ పనిచేసిందా? అతన్ని రక్షించిన శక్తులు ఉన్నాయా? అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.

అసలేంటి ఎప్‌స్టీన్ ఫైల్స్ ..

ఇప్పుడు అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన పత్రాలు ఈ కేసును మరింత వేడెక్కించాయి. కోర్టు రికార్డులు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్స్ — ఇవన్నీ కలిపి లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ప్రముఖుల పేర్లు కనిపించడంతో సంచలనం రేగింది.

మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, హిల్లరీ క్లింటన్ వంటి పేర్లు కోర్టు పత్రాల్లో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి వ్యాపారవేత్తల పేర్లు కూడా విమాన లాగ్స్ లేదా కమ్యూనికేషన్ రికార్డుల్లో కనిపించాయి. చివరికి మన భారత దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉండడం సంచలనంగా మారింది. అయితే వీరిలో చాలా మంది తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

ఎప్‌స్టీన్ 2002 నుంచి 2005 మధ్య ఫ్లోరిడాలో యువతులను లైంగిక దోపిడికి గురి చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. 2019లో అరెస్టై జైలులో ఉన్న సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సహచరురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ ప్రస్తుతం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తోంది.

మరోవైపు ట్రంప్ మరియు ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధం కూడా పెద్ద చర్చగా మారింది. వీరిద్దరి ఫోటోలు, ఫ్లైట్ లాగ్స్, కాంటాక్ట్ బుక్ వివరాలు బయటకు వచ్చాయి.వీరిద్దరి ఫోటోలు అమెరికా రాజకీయాల్లో చిచ్చురేపుతోంది. ట్రంప్ పేరు ఈ స్థాయిలో బయటికి రావడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుందనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది.

అయితే ప్రజలు ఎందుకు ఇంకా ఆసక్తిగా చూస్తున్నారు? కారణం ఒక్కటే — ఇంకా అనేక ప్రశ్నలు సమాధానం లేకుండానే ఉన్నాయి. ఫ్లోరిడాలో ఎప్స్టీన్‌కు ఎందుకు తేలికైన శిక్ష విధించబడింది? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? జైలులో అతని మరణంపై పూర్తిగా స్పష్టత ఉందా?

ఎప్స్టీన్ ఫైళ్లు కేవలం ఒక కేసు పత్రాలు కావు. అవి అధికారం, డబ్బు, ప్రభావం, రహస్యాల కలయిక. ప్రతి విడుదల కొత్త పేర్లను తెస్తోంది… కానీ పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. అసలు ప్రశ్న మాత్రం అదే ..ఇంకా విడుదల కాని పత్రాల్లో ఏముంది? ఇంకా ఎవరి పేర్లు బయటకు రావాల్సి ఉంది?ప్రపంచం ఇంకా ఆ సమాధానాల కోసం ఎదురుచూస్తోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)