Breaking News

బంగ్లాదేశ్‌లో మరో దారుణం

Published on Sat, 01/10/2026 - 15:34

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవలే ఇస్లాం వ్యతిరేఖ ఆరోపణలతో పలువురు హిందు మతానికి చెందిన వ్యక్తులుపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా సునాంఘంజ్ అనే జిల్లాలో  జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై దాడి చేసి అనంతరం విషం ఇచ్చి చంపినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.

బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతుంది ఇటీవల  అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్‌ హాదీ మృతితో హిందువులపై తిరిగి మెుదలైన దాడులు ఏమాత్రం శాంతించడం లేదు. గడిచిన 40 రోజుల్లోనే 12 మంది హిందువులు హత్యకు గురయ్యారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులకు స్పష్టమైన కారణం ఏమి లేకపోయినప్పటికే.. అక్కడి మత ఛాందసవాదులు హిందువులే టార్గెట్‌గా దాడులు జరుపుతున్నారనేది కాదనలేని సత్యం

ఈ నేఫథ్యంలో హత్యలను భారత్ పలుమార్లు ఖండించింది మైనార్టీలపై దాడులు అరికట్టాలని కోరింది. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయి సంతాపం ప్రకటించారు.పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి మతఛాందస వాదులు విద్వేశాన్ని చిమ్మడం ఆపడం లేదు. 

తాజాగా సునాంఘంజ్ జిల్లాలో జోయ్ మాహాపాత్ర అనే హిందూ యువకునిపై  అక్కడి అల్లరిమూకలు దాడి చేశాయి. అతనిని తీవ్రంగా కొట్టి అనంతరం విషం ఇచ్చాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాపాత్రను ఉస్మానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 2026 ప్రారంభమై పదిరోజుల కూడా కాకముందే బంగ్లాదేశ్‌లో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు. 

నూతన సంవత్సర వేడుకల వేళ షరియత్ పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిపై దాడిచేసి చంపారు. జనవరి 5న హిందూ వార్త సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చిచంపారు. అనంతరం నర్సింగి జిల్లాలో వ్యాపారి మణి చక్రవర్తి ప్రాణాలు తీశారు. తాజాగా మహాపాత్ర అనే యువకుడిని విషం ఇచ్చి చంపారు. బంగ్లాదేశ్‌లో ఇంత పెద్దఎత్తున హిందువులపై దాడులు జరగడం భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)