Breaking News

పాక్‌లో హిందూ గుడికి మోక్షం.. 64 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం

Published on Mon, 10/21/2024 - 16:01

ఇస్లామాబాద్‌: ఇస్లామిక్‌ దేశం పాకిస్తాన్‌లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోయిన విషయం తెలిసిందే. ఇక అక్కడి హిందూ ఆలయాలు ఎన్ని దాడులకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటిది 64 ఏళ్ల తర్వాత పాక్‌లోని నరోవల్‌ జిల్లాలోని బావోలీ సాహిబ్‌ గుడిని అక్కడి ప్రభుత్వం పునర్నిర్మిస్తుండడం విశేషం.

1960లోనే ఈ గుడి మూతపడింది. అయితే నరోవల్‌ జిల్లాలోని హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్‌కోట్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఈ గుడిని పునర్నిర్మించాలని పాక్‌ ధర్మస్థాన్‌ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. గుడి నిర్మాణానికి పాక్‌ ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించిందని డాన్ ప‌త్రిక వెల్ల‌డించింది.

ద ఎవాక్యూ ట్రస్ట్‌ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) గుడి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దానికి ధర్మస్థాన్‌ బోర్డుకు అప్పగిస్తారు. పాక్‌ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్‌ సిద్దాల్‌ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్‌ షోయబ్‌ సిద్దాల్‌, నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ సభ్యుడు మంజూర్‌ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. బావోలీ సాహిబ్‌ గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్‌ ధర్మస్థాన్‌ కమిటీ అధ్యక్షుడు సావన్‌ చంద్‌ అక్కడి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: నవంబర్‌ 1 నుంచి 19 వరకు ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)