Breaking News

గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్‌ హిందూ పార్టీ పతనం వెనుక..

Published on Sun, 08/06/2023 - 09:06

పాకిస్తాన్‌కు స్వాతంత్ర్యం లభించకముందు అక్కడ హిందువుల సంఖ్య భారీగానే ఉండేది. దీంతో అక్కడ వారికి తగిన ప్రాధాన్యత లభించేది. స్వాతంత్ర్యం అనంతరం పాక్‌ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదేసమయంలో అక్కడ ఉంటున్న హిందువులు భారత్‌కు తరలివచ్చారు. కొద్దిమంది మాత్రం పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు. వారిలో హిందూ రాజులు కూడా ఉన్నారు. వారిలో ఒకరే పాకిస్తాన్‌లోని అమర్‌కోటకు చెందిన హిందూ రాజు రాణా చంద్ర సింగ్‌. ఇతనే తొలిసారిగా 1990లో పాకిస్తాన్‌లో  పాకిస్తాన్‌ హిందూ పార్టీని స్థాపించారు. 

నాడు పాకిస్తాన్‌లో అమర్‌ కోటగా పిలిచే ప్రాంతాన్ని నేడు ఉమర్‌కోటగా మార్చారు. రాణా చంద్ర సింగ్‌ అక్కడే రాజుగా ఉండేవారు. పాక్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అక్కడి హిందువులకుపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్న విషయాన్ని గమనించిన రాజపూత్‌ వంశస్థుడైన రాణా చంద్ర సింగ్‌ పాకిస్తాన్‌ హిందూ పార్టీని నెలకొల్పారు. అయితే పార్టీకి ప్రజల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. పాకిస్తాన్‌లోని హిందువులు పార్టీకి తగినంత అండనివ్వలేదు. 

రాజకీయ విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్టీలోని కీలకపదవులను రాణా చంద్ర సింగ్‌ కుటుంబ సభ్యులు, పాక్‌లోని అగ్రవర్ణాల వారు ఆక్రమించారు. అప్పట్లో పాక్‌లోని హిందూ ఓటర్లలో అత్యధికులు కింది వర్గాలకు చెందినవారే ఉన్నారు. దీంతో వారు ఈ పార్టీతో అనుసంధానం కాలేకపోయారు. ఫలితంగా పార్టీ ఎంత గొప్పగా ప్రారంభమయ్యిందో అంత వేగంగానే పతనమయ్యింది. 

పాకిస్తాన్‌ హిందూ పార్టీకి చెందిన జెండా హిందూ చిహ్నాలతో కూడి ఉంటుంది. కాషాయవర్ణంలోని జెండాపై త్రిశూలం గుర్తు కనిపిస్తుంది. అలాగే ఓంకారం కూడా ఉంది. ‍ప్రస్తుతం ఈ పార్టీ మనుగడలో లేదు. అయితే ఈ పార్టీని స్థాపించిన రాణా చంద్ర సింగ్‌ కుమారుడు రాణా హమీర్‌ సింగ్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గానే ఉన్నారు. ఆయన సింధ్‌ ప్రాంతానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  సింధ్‌లో ఆయన పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. 
ఇది కూడా చదవండి: మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)