Breaking News

బంగ్లాలో మరో ఘాతుకం.. హిందూ కుటుంబంపై దాడి

Published on Tue, 12/23/2025 - 15:41

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. తాజాగా చట్టోగ్రామ్ ప్రాంతంలో ఓ హిందూ కుటుంబంపై అక్కడి మతతత్వవాదులు దాడి చేశారు. అయితే దీనికి తక్షణమే స్పందించిన ఆ కుటుంబం వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ‍అల్లరిమూకలు వారి ఇళ్లు ధ్వంసం చేసి వారిని హెచ్చరిస్తూ ఒక నోట్ రాశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంనుంచి ఆ దేశంలో దాదాపు 258 మైనార్టీలపై దాడుల ఘటనలు జరుగగా 27మంది దాకా ప్రాణాలు వదిలారు. వారిలో అధికశాతం మంది హిందువులే ఉన్నట్లు సమాచారం. ఇటీవలే  అక్కడి మతతత్వవాదులు దీపు చంద్రదాస్ అనే ఓ యువకుడిని తీవ్రంగా కొట్టిచంపారు. ఈ ఘటనపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.  ఈ ఘటన మరవకముందే తాజాగా అక్కడి చట్టోగ్రామ్‌ ప్రాంతంలో ని ఓ హిందూ కుటుంబంపై అక్కడి అల్లరిమూకలు దాడిచేశాయి.

చట్టోగ్రామ్ ప్రాంతంలో జయంత్ సంగా, బాబు సుకిశిల్ అనే భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారంటూ ఒక అల్లరి మూక వారిపై దాడికి యత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ ఇద్దరు వెంటనే అక్కడ ఫెన్సింగ్ కట్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ దుండగులు వారి ఇళ్లుని ధ్వంసం చేశారు. అనంతరం వారి పెంపుడు జంతువులను చంపేశారు.

అనంతరం వారిని హెచ్చరిస్తూ అక్కడ ఒక నోట్ ఉంచారు అందులో " ఈప్రదేశంలో ఉండే హిందువులను మేము గమనిస్తున్నాము. మీరు ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయు. వెంటనే ఆ కార్యకలాపాలు ఆపండి. లేకపోతే మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది అని బెంగాలీ భాషలో రాశారు.

ఒకవేళ మా హెచ్చరికను మీరు పాటించకపోతే హిందూ సమాజానికి చెందిన వారి ఆస్తులను, వ్యాపారాలను, నివాసాలను వేటిని వదిలిపెట్టబోమన్నారు. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరంటూ వారిని హెచ్చరిస్తూ రాశారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)