Breaking News

అమెరికాలో ‘హిల్లరీ’ బీభత్సం

Published on Tue, 08/22/2023 - 05:54

వాషింగ్టన్‌: అమెరికాలోని పలు రాష్ట్రాల్లో హిల్లరీ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ధాటికి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. ముఖ్యంగా దక్షిణ కాలిఫోరి్నయాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఈ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం కురవడం 84 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని స్థానిక అధికారులు వెల్లడించారు.

తుపాను బీభత్సం సృష్టిస్తుండడంతో నెవెడాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుపాను వల్ల ఏ మేరకు ఆస్తి నష్టం జరిగిందన్న దానిపై సర్వే ప్రారంభించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే డెత్‌ వ్యాలీలోని కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకోవడం గమనార్హం. మరోవైపు దక్షిణ కాలిఫోరి్నయాలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

దక్షిణ కాలిఫోర్నియాలోని ఓజాయ్‌ సిటీకి ఈశాన్య దిక్కున ఆదివారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.1గా నమోదైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలియజేసింది. భూ అంతర్భాగంలో 4.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లాస్‌ఏంజెలెస్‌ నగర సమీపంలో భూమి రెండుసార్లు కంపించినట్లు అధికారులు గుర్తించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)