Breaking News

ఇజ్రాయెల్‌పైకి వందలాది రాకెట్లు

Published on Tue, 11/12/2024 - 06:20

బీరూట్‌: కొద్దిపాటి విరామం తర్వాత లెబనాన్‌ ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌ ఉత్తర ప్రాంతంపై సోమవారం వందలాది రాకెట్లతో దాడికి దిగింది. సెప్టెంబర్‌లో లెబనాన్‌వ్యాప్తంగా వేలాది మంది హెజ్‌బొల్లా సాయుధులను గాయపరచడమే గాక వందల మంది మరణానికి కారణమైన పేజర్‌ దాడులు తమ పనేనని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. 

తమ దేశ ఉత్తర ప్రాంతంపై నిమిషాల వ్యవధిలోనే 165కు పైగా రాకెట్లు వచ్చిపడ్డట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ వార్తా పత్రిక పేర్కొంది. వాటిలో 50కి పైగా కార్మియెల్‌ ప్రాంతం, పరిసర పట్టణాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వివరించింది. మరోవైపు రేవు పట్టణం హైఫాపైకి రెండు విడతల్లో 90కి పైగా రాకెట్లు దూసుకెళ్లాయి. గలిలీ, కార్మియెల్‌ ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలపై తాము చేసిన వ్యూహాత్మక దాడులు విజయవంతమైనట్టు హెజ్‌బొల్లా ప్రకటించింది. అనంతరం రాకెట్‌ దాడుల దృశ్యాలతో కూడిన వీడియోలను ఇజ్రాయెల్‌ సైన్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

 ఈ మతిలేని దూకుడు బారినుంచి ఉత్తర ప్రాంతంలోని తమ పౌరులను పూర్తిస్థాయిలో కాపాడుకుంటామని పేర్కొంది. హెజ్‌బొల్లా రాకెట్లను చాలావరకు ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థ అడ్డుకుని సురక్షితంగా కూల్చేసింది. అయినా పలు రాకెట్లు పౌర ఆవాసాలతో పాటు సైనిక స్థావరాలను కూడా తాకినట్టు సమాచారం. దాడుల్లో బినా పట్టణంలో ఏడాది వయసున్న ఓ చిన్నారితో పాటు ఏడుగురు గాయపడ్డట్టు ఇజ్రాయెల్‌ తెలిపింది. అక్టోబర్‌ 8న కూడా ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా భారీగా రాకెట్‌ దాడులకు దిగడం తెలిసిందే. లెబనాన్‌తో కాల్పుల విరమణ దిశగా చర్చల్లో పురోగతి కని్పస్తోందని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గైడెన్‌ సార్‌ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)