హెజ్‌బొల్లా పెద్ద తప్పు చేసింది: ఇజ్రాయెల్ ప్రధాని

Published on Sun, 10/20/2024 - 08:39

జెరూసలేం: హెజ్‌బొల్లా తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మద్దతు కలిన హెజ్‌బొల్లా తనను, తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నించి ఘోరమైన తప్పు చేసిందని’ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.  ఇటువటి ఘటనలు శత్రువులపై తాము సాగిస్తున్న న్యాయపరమైన యుద్ధాన్ని నిలువరించలేవని, ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను  ఎవరూ ఆపలేరని నెతన్యాహు పేర్కొన్నారు.

నెతన్యాహు  తన ట్విట్టర్‌ ఖాతాలో ‘ఇరాన్‌తో పాటు దాని ప్రతినిధులకు నేను ఒకటే చెబుతున్నాను.. ఎవరైనా సరే ఇజ్రాయెల్ పౌరులకు హాని కలిగించాలని ప్రయత్నిస్తే, వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మేము ఉగ్రవాదులను, వారిని పంపేవారిని అంతమొందించడాన్ని కొనసాగిస్తాం. మేము మా దేశ బందీలను గాజా నుండి స్వదేశానికి తీసుకువస్తాం. మా ఉత్తర సరిహద్దుల్లో నివసిస్తున్న మా పౌరులను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి చేరుస్తాం. ఇజ్రాయెల్ తన యుద్ధ లక్ష్యాలన్నింటినీ సాధించడానికి, రాబోయే తరాలకు ఈ ప్రాంతంలో భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు.
 

హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి తరువాత గాజాలో ఇజ్రాయెల్ తన ఆర్మీ దాడులు ముమ్మరం  చేసింది. గాజాలో గత 24 గంటల్లో ఇజ్రాయెల్  జరిపిన దాడుల్లో 93 మంది మృతి చెందారు. గాజాలోని ఎనిమిది శరణార్థుల శిబిరాలపై ఇజ్రాయెల్ భారీ దాడి చేసింది. ఈ దాడుల్లో రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల దాడుల్లో ఇప్పటి వరకు వందలమంది మృతిచెందారు. 

ఇది కూడా చదవండి: నోకియాలో ఉద్యోగాల కోత.. ఈ సారి ఎంతమందంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)