Breaking News

పాక్‌లో మండుతున్న ఎండలు.. 4 రోజ్లులో 450 మంది మృతి

Published on Thu, 06/27/2024 - 12:39

కరాచీ: పొరుగు దేశం పాకిస్తాన్‌లో వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని అతిపెద్ద నగరంగా పేరొందిన కరాచీలో వడగాడ్పులకు 450 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య అధికంగా ఉండటంతో మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీల్లో స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.

పాక్‌లోని పలు స్వచ్ఛంద సంస్థలు దేశంలో విలయతాండవం చేస్తున్న ఎండల గురించి, వడగాడ్పుల కారణంగా మృతి చెందినవారి గురించి చెబుతున్నప్పటికీ పాక్ ప్రభుత్వం ఇంకా దీనిపై స్పందించలేదు. పాక్‌లోని ఓడరేవు నగరమైన కరాచీలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. తాజాగా ఈధి ఫౌండేషన్‌ కరాచీలో నాలుగు రోజుల్లో 427 మృతదేహాలు లభ్యమయ్యాయని, సింధ్ ప్రభుత్వం మంగళవారం 23 మృతదేహాలను మూడు ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిందని తెలియజేసింది.

ఫౌండేషన్ చీఫ్ ఫైసల్ ఈధి మాట్లాడుతూ కరాచీలో నాలుగు మార్చురీలు  ఉన్నాయని, మృతదేహాలను  ఉంచేందుకు ఈ మార్చురీలలో స్థలం  సరిపోవడం లేదని అన్నారు. వీధులలో ఈ మృతదేహాలు లభ్యమయ్యాయని ఈధి తెలిపారు. వడగాడ్పుల కారణంగానే వీరంతా మరణించి ఉంటారన్నారు. మంగళవారం135 మృతదేహాలు, సోమవారం 128 మృతదేహాలు తమకు లభ్యమయ్యాయని అన్నారు. ఈధి ట్రస్ట్ పాకిస్తాన్‌లో పేదలు, నిరాశ్రయులు, అనాథ వీధి పిల్లలు, బాధిత మహిళలకు సేవలను అందిస్తుంటుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)