Breaking News

అట్టుడుకుతున్న యూరప్‌

Published on Fri, 07/04/2025 - 05:04

బెర్లిన్‌: యూరప్‌ దేశాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు స్పెయిన్‌లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్‌లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్‌లోని బెజ్‌నౌ అణు రియాక్టర్‌ను మూసివేశారు. మరో అణు రియాక్టర్‌లో విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్‌లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు. 

ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆస్పత్రి పాలయ్యారని ఫ్రాన్స్‌ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. దీంతో, జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్‌ ఎయిర్‌ స్విమ్మింగ్‌ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్‌బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్‌ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌తోపాటు బ్రస్సెల్స్‌లోని అటోమియంను మూసివేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)