Breaking News

‘తిండి పెట్టరు.. టాయిలెట్‌ నీళ్లే గతి’.. లిబియాలో నరకం చూసిన హరియాణా యువకులు

Published on Wed, 08/23/2023 - 13:39

డాలర్లు సంపాదించాలనే కోరికతో హరియాణా, పంజాబ్‌కు చెందిన యువత ఇటలీకి తరలివెళుతుంటుంది. అయితే వారు ఊహించిన వాతావరణం అక్కడ ఉండదు. జైళ్లలో మగ్గిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇటువంటి నరకాన్ని చవిచూసిన హరియాణాకు చెందిన ఇద్దరు యువకులు ఆరు నెలల అనంతరం భారత్‌లోని తమ ఇంటికి తిరిగివచ్చారు. ఇక్కడికి చేరుకోగానే వారు తాము లిబియాలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఢిల్లీలో మీడియా ముందు వెళ్లగక్కారు. 

ఒక ఏజెంట్‌ తమను ఇటలీ పంపిస్తామని చెప్పి రూ. 13 లక్షలు తీసుకుని లిబియాకు పంపించాడన్నారు. కొన్నాళ్లు లిబియాలో పనిచేశాక ఇటలీ పంపిస్తామని అ ఏజెంట్‌ నమ్మబలికాడన్నారు. అయితే తమకు లిబియాలో ఎవరికో అమ్మివేశాడన్నారు. వారు తమ చేత అన్నిరకాల పనులు చేయించారని, తరువాత ఏవో ఆరోపణలతో తమను జైలుకు పంపించారన్నారు. లిబియా జైలులో రెండుమూడు రోజుల పాటు ఎటువంటి ఆహారం ఇచ్చేవారు కాదని తెలిపారు. తాము చనిపోకుండా ఉండేందుకు టాయిలెట్‌ నీటిని అందించేవారన్నారు. 

లిబియాలో తమ లాంటి వారు చాలా మంది ఉన్నారని, వారంతా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందినవారున్నారని తెలిపారు. తామంతా జైలులో నరకం చూశామన్నారు. అయితే తమలోని ఒక యువకుని దగ్గర ఫోన్‌ ఉందని, ఆ ఫోను సాయంతో రహస్యంగా భారత ఎంబసీకి ఫోన్‌ చేసి, తమ గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఎట్టకేలకు తమ ప్రయత్నాలు ఫలించి భారత ఎంబసీ సాయంతో 6 నెలల అనంతరం భారత్‌కు చేరుకోగలిగామన్నారు. బాధితుడు రాహుల్‌ సోదరి సోనియా మాట్లాడుతూ తన సోదరునికి ఇప్పుడు మరో జీవితం లభించినట్లయ్యిందన్నారు. తమ సోదరుడు తిరిగి రావడం వెనుక ప్రభుత్వం చొరవ ఉందన్నారు. 
ఇది కూడా చదవండి: చికెన్‌, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)