Breaking News

పాముకు చేత్తో ఆహారం పెట్టాడు.. డాక్టర్లు వేలిని కత్తిరించారు?

Published on Thu, 01/01/2026 - 17:57

పాముల్లో ఉండే గుణం.. కాటు వేయడం.  అన్ని పాముల్లో విషం లేకపోయినా, విషపూరిత పాములతోనే అత్యంత ప్రమాదం. అది మనం పెంచుకునే విషపూరిత పాము అయినప్పటికీ దానితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే మన ప్రాణం మీదకు తెచ్చుకోవాలి. అదే జరిగింది ఇక్కడ. ఓ వ్యక్తి విషపూరిత పామును ముచ్చటగా పెంచుకుంటున్నాడు. కానీ  ఆ పాము కాటుతో తన చేతి వేలిని కోల్పోయాడు సదరు వ్యక్తి.  చైనా దేశంలోని బీజింగ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది. 

అతనికి చిన్నప్పటినుండి పాములంటే ఆసక్తి. ఆ క్రమంలోనే ఓ విషపూరిత పామును పెంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాముకు జబ్బు చేసి ఆహారం తినలేకపోతోంది. దానికి బలవంతంగా చేతితో ఆహారాన్ని పెడుతూ వస్తున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఆ పాము కోరల్లో అతని చేయి ఇరుక్కుంది.  దాంతో పాము కాటుకు బారిన పడ్డ ఆ వ్యక్తి ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి కరిచిన వేలిని తీసేయాలన్నారు. వేలిలో విషం ఉందని, అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పడంతో చేసేదిలేక వేలిని తీయించుకున్నాడు. ఇది ఆ వ్యక్తికి నేర్పిన జీవిత పాఠంగా గుర్తిండిపోవడం ఖాయం. విషపూరితమైన వాటికి దూరంగా ఉండటం ఎంత మంచిదో ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది.

అదొక ఫైవ్‌ స్టెప్‌ స్నేక్‌
చైనీస్ కథల్లో ఈ పామును "ఫైవ్‌ స్టెప్‌ స్నేక్‌" అని పిలుస్తారు. ఇది అంతటి విషపూరితమైందని నమ్మకం ఉంది, ఒకవేళ ఇది ఎవరినైనా కరిస్తే వారు ఐదు అడుగులు కూడా వేయకముందే మరణిస్తారని చెబుతారు. ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో విచిత్రమైన మరియు తరచుగా ప్రమాదకరమైన జంతువులను పెంపుడు జంతువులుగా పెట్టుకునే ధోరణి పెరుగుతోంది.

ఈ పాము విషం.. అత్యంత వేగంగా ప్రభావం
‘ఫైవ్‌ స్టెప్‌ స్నేక్‌"అనేది అత్యంత విషపూరిత పాముకు సంబంధించినది.
ఈ పాము కాటు వేస్తే, విషం చాలా వేగంగా ప్రభావం చూపుతుంది.
ప్రజల్లో ఒక నమ్మకం ఉంది: కాటు పడిన వ్యక్తి ఐదు అడుగులు కూడా వేయలేడు, వెంటనే కుప్పకూలిపోతాడు.
అందుకే దీనిని "ఫైవ్‌ స్టెప్‌ స్నేక్‌" అని పిలుస్తారు.
శాస్త్రీయ పేరు- రస్సెల్ వైపర్
శరీరంపై గోధుమ రంగు, పెద్ద పెద్ద వృత్తాకార మచ్చలు ఉంటాయి.
 పొడవు సాధారణంగా 1–1.5 మీటర్లు.
రాత్రివేళ ఎక్కువగా చురుకుగా ఉంటుంది.

విష ప్రభావం
రక్తం గడ్డకట్టే విధానాన్ని (blood clotting) దెబ్బతీస్తుంది.
తీవ్రమైన నొప్పి, వాపు, అంతర్గత రక్తస్రావం కలుగుతుంది.
తక్షణ వైద్య సహాయం లేకపోతే ప్రాణాపాయం.
 

Videos

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు