Breaking News

మా షరతులు అంగీకరిస్తే బందీలకు సాయం చేస్తాం 

Published on Tue, 08/05/2025 - 04:58

కైరో: ఇజ్రాయెల్‌ కొన్ని షరతులను నెరవేరిస్తే, బందీలకు సహాయం అందించడానికి రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవడానికి తాము సిద్ధమని హమాస్‌ ఆదివారం తెలిపింది. రెడ్‌క్రాస్‌తో ఏదైనా సమన్వయం కావాలనుకుంటే.. ఇజ్రాయెల్‌ శాశ్వతంగా మానవతా కారిడార్లను తెరవాలని, సహాయ పంపిణీ సమయంలో వైమానిక దాడులను నిలిపివేయాలని హమాస్‌ డిమాండ్‌ చేసింది. ఇజ్రాయెల్‌ అధికారుల ప్రకారం, గాజాలో ఇప్పుడు 50 మంది బందీలు మిగిలి ఉన్నారు. వారిలో 20 మంది మాత్రమే బతికే ఉన్నారని భావిస్తున్నారు. హమాస్‌ ఇప్పటివరకు, మానవతా సంస్థలు బందీలను సంప్రదించకుండా నిషేధించింది.

 వారి పరిస్థితుల గురించి కుటుంబాలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కృశించిపోయిన ఇజ్రాయెల్‌ బందీ డేవిడ్‌ వీడియో హమాస్‌ విడుదల చేయగా.. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. వీడియో.. ఇజ్రాయేలీలను భయభ్రాంతులకు గురి చేయగా.. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లు హమాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. గాజాలో బందీల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం ఉదయం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుందని ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హమాస్‌ తాజా ప్రతిపాదన తీసుకొచ్చింది.  

దాదాపు రెండేళ్ల యుద్ధం తరువాత.. మానవతా విపత్తు ఎదుర్కొంటున్న గాజాకు ఇంధన సరఫరాను అనుమతించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.ఇంధన కొరత ఆసుపత్రుల కార్యకలాపాలకు ఆటంకం కలిగించడంతో పాటు ఆకలి మరణాలు పెరుగుతున్నాయనే భయాల మధ్య ఇజ్రాయెల్‌ ఈ సడలింపును జారీ చేసింది. ఆదివారం, రెండు ట్రక్కులు ఈజిప్ట్‌ నుంచి ఇజ్రాయెల్‌ నియంత్రణలో ఉన్న కారెం అబు సలేం క్రాసింగ్‌ ద్వారా గాజాలోకి ప్రవేశించాయి.

 ఆసుపత్రులు, బేకరీలు, పబ్లిక్‌ కిచెన్‌లకు సహాయం చేయడానికి ఈ వారం చివరిలో మరో నాలుగు ట్యాంకర్లు యూఎన్‌ ఇంధనం వచ్చే అవకాశం ఉంది. ఆస్పత్రులు, బేకరీలు, పబ్లిక్‌ కిచెన్లు, ఇతర ముఖ్యమైన సేవల కార్యకలాపాలకు సహాయం చేయడానికి నాలుగు యూఎన్‌ ఇంధన ట్యాంకర్లు ప్రవేశించాయని సహాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయెల్‌ సైనిక సంస్థ సీఓజీఏటీ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో గాజాలో ఆకలి లేదా పోషకాహార లోపంతో మరో ఆరుగురు మరణించారని దాని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కరువు కారణంగా మరణించిన వారి సంఖ్య 175కి పెరిగింది. వీరిలో 93 మంది పిల్లలు ఉన్నారు. 
4

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)