Breaking News

మెట్టుదిగిన హమాస్‌..మరో​ ముగ్గురు బందీల విడుదల

Published on Sat, 02/15/2025 - 15:28

గాజా: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు చెందిన మరో ముగ్గురు బందీలను ఉగ్రవాద సంస్థ హమాస్‌ శనివారం(ఫిబ్రవరి15) విడుదల చేసింది. ముగ్గురు బందీలను రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్‌ డెకెల్ చెన్‌ (36),అలెగ్జాండర్‌ ట్రుఫనోవ్ (29), యైర్‌ హార్న్‌(46)బందీలు హమాస్‌ చెర నుంచి బయటికి వచ్చారు. ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది.

దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో  సహా ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకుంది.తమ బందీలను విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.ఈ బెదిరింపులకు భయపడ్డ హమాస్‌ బందీల విడుదలకు అంగీకరించింది. ముగ్గురు బందీల విడుదలకు  ప్రతిగా ఇజ్రాయెల్‌ 369 మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడుదల చేసింది.

ఖతర్‌,ఈజిప్టు మధ్యవర్తిత్వంతో గత నెల ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా.. హమాస్ తమ చెరలోని 94 మంది బందీల్లో 33 మంది బందీలను విడుదల చేయనుంది.ప్రతిగా దాదాపు 1700 మందికిపైగా పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్‌ ఇప్పటివరకు 21 మంది ఖైదీలకు విముక్తి కల్పించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)