Breaking News

గాజా యుద్ధం కొనసాగిస్తాం

Published on Mon, 09/16/2024 - 07:36

గాజాలోని హమాస్‌ మిలిటెంట్లను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్‌ ఎన్ని దాడులు చేసినా, ఎంత నష్టపోయినా తమ పోరాటం కొనసాగిస్తామని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్‌తో పోరాడటానికి తమకు తగినంత వనరులు ఉన్నాయని హమాస్‌ సీనియర్‌ నేత ఇస్తాంబుల్‌లో ఓ  ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘‘ గాజాలో 11 నెలలకు పైగా యుద్ధం జరగుతోంది.  ఇజ్రాయెల్‌ దాడుల్లో  నష్టపోయినప్పటికీ మా పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటానికి మా వద్ద తగినంత వనరులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతిఘటన దాడులు కొనసాగించడానికి మేము అధిక సామర్థ్యాన్ని కలిగిఉన్నాం. అమరవీరులు ఉన్నారు, వారి త్యాగాలు ఉన్నాయి. ప్రతిఘటనలో కొత్త తరాలను చేర్చుకోవడం జరుగుతోంది. ఈ యుద్ధంలో మేము ఊహించిన దానికంటే.. ప్రాణనష్టం, యుద్ధ విస్తరణ తక్కువగానే జరిగింది’ అని అన్నారు.

ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మాట్లాడుతూ.. ‘11 నెలలకు పైగా ఇజ్రాయెల్‌- హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ  క్రమంలో హమాస్ సైనిక సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిని ఉంటాయి. గతంలో మాదిరిగా గాజాలో హమాస్‌ సైనిక నిర్మాణం ఉనికిలో లేనట్టు భావిస్తున్నా’ అని  వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌ హమాస్‌ నేత స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.

చదవండి: హమాస్‌ మిలిటరీ వ్యవస్థగా ఎక్కువ కాలం కొనసాగదు: ఇజ్రాయెల్‌

 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)