Breaking News

హమాస్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

Published on Sun, 11/23/2025 - 09:45

గాజా: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. గాజాలోని హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణనష్టం చోటు చేసుకుంది. అయితే, ఇజ్రాయెల్‌ ఇలాగే దాడుల్ని కొనసాగిస్తే పూర్తి స్థాయి యుద్ధం తప్పదని హమాస్‌ హెచ్చరికలు జారీ చేసింది. 

గాజాలోని హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ వైమానిక దళం దాడులు చేసింది. ఈ దాడుల్లో 24మంది పాలస్తీనీయులు మృతి చెందారు. వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు హమాస్‌ సీనియర్‌ సభ్యులు హతమయ్యారని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ సందర్భంగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉండగా.. తాము వైమానిక దాడులు చేయడానికి ప్రధాన కారణం హమాస్‌ అని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. గాజా ప్రాంతంలో హమాస్‌ మిలిటెంట్లు తమ సైనికులపై కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ చర్యగా ఈ దాడులు జరిపినట్లు  తెలిపింది.

తాజా సమాచారం ప్రకారం, ఇజ్రాయెల్–హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అక్టోబర్‌ 10, 2025న అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం దశల వారీగా కొనసాగుతుండగా.. నవంబర్‌ 13 నుండి 21 వరకు హమాస్‌ మిలిటెంట్లు కనీసం ఎనిమిది సార్లు ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ సైన్యం హమాస్‌ స్థావరాలపై దాడులు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)