Breaking News

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక నేత మృతి

Published on Wed, 01/03/2024 - 09:03

లెబనాన్: పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ సైన్యం ముందుకు వెళుతోంది. యుద్ధం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్‌కు చేరుకుంది. ఈ దాడుల్లో హమాస్ డిప్యూటీ నాయకుడు సలేహ్ అల్-అరూరిని హతమార్చినట్లు అధికారులు తెలిపారు. అరూరి అంగరక్షకులు కూడా మరణించారని వెల్లడించారు. 

ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్‌కు బీరూట్ కేంద్రంగా మారింది. బీరూట్‌ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా పేర్కొంది. లెబనీస్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్‌ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ సేనలు ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ దాడి నుంచి అప్రమత్తమైన ఇజ్రాయెల్.. పాలస్తీనాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ను అంతం చేయడమే లక్ష‍్యమని ఇజ్రాయెల్ యుద్ధంలో ముందుకు వెళుతోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ వైపు 22,185 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1,140 మంది మరణించారు.     

ఇదీ చదవండి: ఆఫ్గానిస్థాన్‌లో భూకంపం.. అరగంట వ్యవధిలో రెండుసార్లు

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)