Breaking News

గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం.. ఇద్దరు హమాస్‌ టాప్‌ కమాండర్‌ల హతం

Published on Wed, 11/01/2023 - 11:05

ఇజ్రాయెల్‌ సైతన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య గత మూడు వారాలుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్‌ 7న గాజా స్ట్రిప్‌ నుంచి చొరబడిన హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్‌ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్నాయి హమాస్‌ మిలిటెంట్ల సొరంగాలు, రహస్య స్థావరాలను నేలమట్టం చేయడమే ధ్యేయంగా ఇజ్రాయెల్‌ సైన్యం పోరాడుతోంది. గాజాపై  భూతల, వైమానిక దాడులు ఉధృతం చేసింది. 

ఇజ్రాయెల్‌ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. మంగళవారం ఇజ్రాయెల్‌ క్షిపణుల ధాటికి వందలాది నివాసాలు నేలమట్టమయ్యాయి. ఒక్క రోజే ఏకంగా 300 ‘లక్ష్యాలను’ ఛేదించినట్టు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ముఖ్యంగా గాజాలోని అతిపెద్ద శరణార్థుల శబిరంపై జరిపిన వౌమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోపల్పోయారు. ఈ కాల్పుల్లో హమాస్‌ సీనియర్‌ కమాండర్‌ హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది

ఇద్దరు హమాస్‌ కమాండర్‌లు హతం! 
అక్టోబర్‌ ఏడో తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ భారీ మెరుపుదాడికి పథక రచన చేసిన హమాస్‌ ఉత్తర డివిజన్‌ కమాండర్‌ నసీమ్‌ అబు అజీనా తమ దాడుల్లో హతమైనట్టు సైన్యం పేర్కొంది. అదే విధంగాహమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీ సైతం హతమార్చినట్లు బుధవారం ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతమంతా పూర్తిగా నాశనమైంది.దీంతో అక్కడి నివాసితులందరూ తమ భద్రత కోసం దక్షిణం వైపు వెళ్లాలని ఐడీఎఫ్‌ పిలుపునిచ్చింది. 

తొమ్మిది వేలకు చేరిన మరణాలు
ఇక ఇప్పటిదాకా పోరుకు బలైన పాలస్తీనియన్ల సంఖ్య 8,525 చేరిందని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 3,542 మది చిన్నారులు, 2,187 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులు మొదలైన తర్వాత వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్లపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో ఇక్కడ 122 మందికిపైగా జనం ప్రాణాలు  కోల్పోయారు. 

ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్‌ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.  మంగళవారం, హమాస్ నాయకుడు సలేహ్ అల్-అరూరి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది. యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకెన్‌ శుక్రవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)