Breaking News

ఇజ్రాయెల్‌ దాడుల్లో బందీల మృతి

Published on Fri, 10/13/2023 - 14:02

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో తమ ఆధీనంలో ఉన్న బందీలు మరణించినట్లు హమాస్‌ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో గాజా స్ట్రిప్‌ ఉత్తర భాగంలో ఈ దాడులు జరగ్గా వేర్వేరు ప్రాంతాల్లోని మొత్తం 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. వీరిలో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు  విదేశీయులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. హమాస్‌ గత శనివారం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి సుమారు 150 మందిని బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బందీల్లో సాధారణ పౌరులు, విదేశాలకు చెందిన వారూ ఉన్నారు.

బందీలను హమాస్‌ చెర నుంచి తప్పించేందుకు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ సైనికులు కృషి చేస్తూనే హమాస్‌ బలగాలను మట్టుబెట్టేందుకూ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గాజా మొత్తంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. 

గాజా స్ట్రిప్‌ జనాభా దాదాపు 24 లక్షలు. ఇజ్రాయెల్‌ బాంబు, క్షిపణి దాడులు విపరీతమైన ఆస్తినష్టాన్ని మిగులుస్తున్నాయి. భవనాలు నేలమట్టం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. ఇజ్రాయెల్‌ ఇప్పటివరకూ గాజాపై జరిపిన దాడుల్లో 1500 మంది మృతి చెందారు. అందులో 500 మంది చిన్నారులే ఉన్నట్లు హమాస్‌ మీడియా కార్యాలయం ప్రకటించింది. 

మరోవైపు గాజా పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులకు.. ప్రతిగా బందీలను హతమారుస్తామంటూ హమాస్‌ ప్రకటించినప్పటికీ.. ఇజ్రాయెల్‌ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో.. నీటి, కరెంట్‌ సరఫరాను నిలిపివేసింది. తాజాగా గాజాను ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి మాత్రం ఇజ్రాయెల్‌ రక్షణ దళం ఆదేశాలు ఆచరణ సాధ్యం కాదని.. అది కల్లోలానికి దారి తీస్తుందని చెబుతోంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)