Breaking News

ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం.. పూర్తి దిగ్బంధంలో గాజా..

Published on Mon, 10/09/2023 - 20:54

పాలస్తీనా మిలిలెంట్లు హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య మూడు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ పోరులో ఇప్పటి వరకు 1100 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క ఇజ్రాయెల్‌లోనే 44 మంది సైనికులతోపాటు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్‌ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్‌లో చొరబడి దాడులు మొదలు పెట్టింది హమాజ్‌ అయినా.. ఇజ్రాయెల్‌ సైన్యం సైతం గాజాపై విరుచుకుపడుతోంది. రాకెట్లు, మిస్సైల్స్‌తో  దాడులు జరుపుతోంది. 

హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకొంది.హమాస్ అధీనంలో ఉన్న గాజాను సైతం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరలైన కరెంట్‌, ఆహారం, ఇంధనంను నిలిపివేసింది. కాగా శనివారం ఉదయం హమాజ్‌  దాడి మొదలైనప్పటి నుంచి.. ఇజ్రాయెల్‌ గాజాకు విద్యుత్‌ను కట్‌ చేయంతో అంధకారాన్ని ఎదుర్కొంటుంది.

దీనిపై ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి యోవో గల్లాంట్‌ మాట్లాడుతూ.. గాజాను పూర్తిగా దిగ్భంధించమని ఆదేశించినట్లు తెలిపారు. ఇక అక్కడ విద్యుత్‌, ఆహారం, నీరు, అందదని తెలిపారు. తాము  మానవ మృగాలతో పోరాడుతున్నామని, దానికి తగ్గట్లే తమ పోరాటం ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా  2007లో పాలస్తీనా బలగాల నుంచి హమాస్‌ అధికారాన్ని చేజిక్కించుకునన్నప్పటిన ఉంచి గాజాపై ఇజ్రాయెల్‌, ఈజిప్టు వివిధ స్థాయిలో దిగ్భంధనాలు విధించాయి.

గాజా.. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం. 362 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రస్తుత యుద్ధంతో వారంతా బిక్కుబిక్కుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. గాజాకు తూర్పు, ఉత్తర భాగాల్లో ఇజ్రాయెల్‌, దక్షిణాన ఈజిప్టు, పశ్చిమ భాగంలో మధ్యదరా సము ద్రం సరిహద్దులుగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇరుదేశాలు జల, వాయు, భూ దిగ్బంధాన్ని విధించాయి. దీంతో గాజా వాసులు ఎటువెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎటునుంచి మృత్యువు వస్తుందో తెలియక చావు భయంతో నరకయాతన అనుభవిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)