Breaking News

హమాస్ దాడికి ఏడాది.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం

Published on Sun, 10/06/2024 - 20:56

ఇజ్రాయెల్‌, గాజాలోని హమాస్‌ బలగాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.  హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం భీకర దాడులు చేస్తోంది. అయితే.. అక్టోబర్‌ 7వ తేదీకి హమాస్‌ బలగాలు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో హమాస్‌ దాడి మొదటి వార్షికోత్సవానికి ఒకరోజు ముందు ఇవాళ (ఆదివారం) మరోసారి.. ఉత్తర గాజా నుంచి పలు రాకెట్లు దక్షిణ ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించాయని ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘‘అనేక రాకెట్లు ఉత్తర గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించినట్లు గుర్తించాం. అందులో ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. మిగిలినవి రాకెట్లు జనావాసాలు లేని బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి’’ అని సైన్యం తెలిపింది. ఇక.. హమాస్‌ బలగాలు.. ఇజ్రాయెల్‌పై చేసిన దాడికి ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో తమ సైన్యం మరింత అప్రమత్తంగా ఉందని ఇజ్రాయెల్‌ పేర్కొంది.

 

గతేడాది అక్టోబర్‌ 7న  హమాస్‌ బలగాలు ఇజ్రాయెల్‌పై దాడి.. ఇజ్రాయెల్‌ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. ఇక.. అప్పటి నుంచి తమ పౌరులను విడిచిపెట్టే వరకు హమాస్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్‌ చెబుతోంది. హమాస్‌ టార్గెట్‌  ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడుల్లో 41, 900 మంది పాలస్తీనా పౌరులు  మృత్యువాతపడ్డారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)