Breaking News

భారతీయులకు శుభవార్త.. హెచ్‌-1బీ వీసాలపై కీలక ప్రకటన

Published on Sat, 01/31/2026 - 07:13

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బీ(H-1B) వీసాల విషయంలో కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బీ వీసా రిజిస్ట్రేషన్‌ ష్యెడూల్‌ను విడుదలైంది. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 4 నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియ మార్చి 20 వరకు కొనసాగుతుందని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

వివరాల మేరకు.. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తుల ప్రక్రియ మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. లాటరీలో మెరిట్‌, అధిక వేతనం ఉన్న వారికి టాప్‌ ‍ప్రయారిటీ ఇవ్వనున్నారు. నైపుణ్యం ఆధారిత వెయిటెడ్‌ సెలక్షన్‌ పద్దతిని ట్రంప్‌ సర్కార్‌ అమలు చేయనుంది. ఇదే సమయంలో మల్టిపుల్‌ రిజిస్ట్రేషన్ల మోసాలకు యూఎస్‌సీఐఎస్‌ చెక్‌ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నారు. ఈ లాటరీ ద్వారా ఎంపికైనవారు 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పని చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ వీసా లాటరీ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హెచ్‌-1బీ వీసాల విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వీసా లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తే అవన్నీ రద్దు చేస్తారు. కాగా మొత్తం H-1B వీసాలు 85,000 మాత్రమే ఉండగా.. ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీకి, మరో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించారు. ఈ వీసాకు అర్హులైనవారు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 10 డాలర్లు మాత్రమే అయినా.. లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)