Breaking News

విమానాశ్రయంపై దుండగుల దాడి.. 35 మంది మృతి

Published on Thu, 06/18/2026 - 23:56

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజర్‌ రాజధాని నియామేలోని డియోరీ హమానీ అంతర్జాతీయ విమానాశ్రయంపై గురువారం తెల్లవారుజామున సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఐదు నెలల వ్యవధిలో ఇదే విమానాశ్రయంపై జరిగిన రెండో దాడి కావడం గమనార్హం.

ఉదయం ప్రార్థనలు ముగించుకుని వచ్చిన స్థానికులు భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. విమానాశ్రయం సమీపంలో ఉన్న సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది గంటల్లో పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భద్రతా బలగాలు దుండగుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

స్థానిక భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, కాల్పుల్లో 35 మంది మరణించినట్లు సమాచారం. కొందరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడి అనంతరం కొంతమంది దుండగులు స్థానిక జనాల్లో కలిసిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు. అయితే ఇదే విమానాశ్రయంపై జనవరిలో జరిగిన దాడికి ఇస్లామిక్‌ స్టేట్‌తో అనుబంధం ఉన్న ఓ సంస్థ బాధ్యత వహించింది.

నైజర్‌, మాలీ, బుర్కినా ఫాసో కలిసి ఏర్పరచుకున్న Alliance of Sahel States భద్రతా వ్యవస్థలకు ఈ విమానాశ్రయం కీలక కేంద్రంగా ఉంది. అందువల్ల ఈ దాడి ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)