Breaking News

స్కూల్‌లో చొరబడి విద్యార్థులు, టీచర్ల నిర్బంధం

Published on Thu, 02/12/2026 - 06:19

హాట్‌ యాయ్‌: పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న ఓ ఆగంతకుడు సమీప స్కూల్‌లోకి చొరబడి గన్‌తో అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులను బెదిరించి అందర్నీ బంధించిన ఉదంతం థాయిలాండ్‌లో జరిగింది. విషయం తెల్సి రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఎలాగోలా అందర్నీ క్షేమంగా విడుదలచేశారు. అయితే ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడ్డాడు. 

రెండు గంటలపాటు తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ ఘటన ఎట్టకేలకు సుఖాంతంకావడంతో పోలీసులు, స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. దక్షిణ థాయిలాండ్‌లోని హాట్‌ యాయ్‌ జిల్లాలోని సోంగ్‌ఖ్లా పట్టణంలోని ఫటోంగ్‌ ప్రథాన్‌ ఖిరివాట్‌ స్కూల్‌లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రెండు గంటలపాటు అందర్నీ తన బందీలుగా మార్చుకున్న 19 ఏళ్ల ఆగంతకుడిని ఖేమ్నన్‌గా పోలీసులు గుర్తించారు. 

స్కూల్‌లో తన సోదరికి పాఠాలు చెప్పిన ఒక టీచర్‌ను లక్ష్యంగా చేసుకుని పాఠశాలలోకి ఖేమ్నన్‌ చొరబడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఖేమ్నన్‌కు పాఠశాలకు మధ్య నెలకొన్న వివాదం ఏమిటన్నది తెలియరాలేదు. స్కూల్లో పలుమార్లు కాల్పుల శబ్దాలు విన్పించాయని, పలువురు గాయపడ్డారని తొలుత వచ్చిన వార్తలను థాయిలాండ్‌ ప్రభుత్వం ఖండించింది. థాయిలాండ్‌లో తుపాకీల సంస్కృతి ఎప్పట్నుంచో ఉంది. ఇక్కడి జనాభాలో చాలా మందికి గన్‌లను కొనుగోలుచేసే అలవాటు ఉంది. వ్యక్తిగత మనస్పర్ధలతో తుపాకీల మోతలు మోగుతాయిగానీ గుమిగూడిన జనాలపై సామూహికంగా కాల్పుల ఘటనలు అత్యంత అరుదు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)