Breaking News

సార్వభౌమత్వంపై సంప్రతింపుల్లేవ్‌

Published on Fri, 01/23/2026 - 04:30

కోపెన్‌హాగెన్‌: తమ దేశ సార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని డెన్మార్క్‌ మహిళా ప్రధాని మెటె ఫ్రెడరిక్సన్‌ తెగేసి చెప్పారు. పాక్షికంగా డెన్మార్క్‌ ఏలుబడిలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా చేజిక్కించుకుంటామని, ఆర్కిటిక్‌ ప్రాంతంలో భద్రతపై నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టేతో సంప్రతింపులు జరిపామని ట్రంప్‌ ప్రకటించిన వేళ ఫ్రెడరిక్సన్‌ ఘాటుగా స్పందించారు. 

‘‘ ఆర్కిటిక్‌ ప్రాంతంలో భద్రత అనేది నాటో సభ్యదేశాలన్నీ కూర్చుని మాట్లాడుకోవాల్సిన అంశం. నాటో చీఫ్‌ హోదాలో రుట్టేతో ట్రంప్‌ మాట్లాడినా ఇబ్బందేంలేదు. కానీ గ్రీన్‌లాండ్‌ వంటి మాకు సంబంధించిన సార్వ భౌమత్వ అంశాలపై ఎవరు మాట్లాడినా ఊరుకోబోం. మా సార్వభౌమత్వ అంశాన్ని ఇంకెవరితోనో చర్చించాల్సిన అగత్యం మాకు లేదు. దావోస్‌లో ట్రంప్, రుట్టే మాట్లాడుకున్నారు. అంతకుముందు, తర్వాత సైతం రుట్టేతో మాట్లాడా. అది కేవలం మర్యాదపూర్వక భేటీ. అందులో గ్రీన్‌లాండ్‌ అంశం చర్చకు రాలేదు’’ అని ఫ్రెడరిక్సన్‌ స్పష్టంచేశారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)