Breaking News

గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ : 30 ఏళ్లుగా ఉంటున్న భారత సంతతి మహిళ అరెస్ట్

Published on Tue, 12/16/2025 - 14:49

అమెరికాలో  గ్రీన్‌ కార్డ్‌ ఇంటర్వ్యూలో భారత సంతతికి చెందిన 60  ఏళ్ల  మహిళకు  భారీ ఎదురు దెబ్బ తగిలింది.  అమెరికాలో 30 ఏళ్లుగా నివసిస్తున్నమహిళను గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి రౌండ్‌లో అరెస్ట్‌  చేయడం కలకలం రేపింది. బబ్లీజీత్ కౌర్ అలియాస్ బబ్లీ అనే మహిళ, గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ చివరి దశలో ఉండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు  తన తల్లిని అదుపులోకి తీసుకున్నారని  ఆమె కుమార్తె జోతి  మీడియాకు తెలిపారు. 1994 నుండి అమెరికాలో నివసిస్తున్న బబుల్జిత్ "బబ్లీ" కౌర్, పెండింగ్‌లో ఉన్న ఆమె గ్రీన్ కార్డ్ దరఖాస్తు కోసం బయోమెట్రిక్ స్కాన్ అపాయింట్‌మెంట్ సమయంలో ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు.  డిసెంబర్ 1న తన తల్లి యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కార్యాలయం  డెస్క్ వద్ద ఉన్నప్పుడు, పలువురు ఫెడరల్ ఏజెంట్లు భవనంలోకి ప్రవేశించారని జ్యోతి  చెప్పింది. ఆ తర్వాత ఫెడరల్ ఏజెంట్లు వెళ్లిన గదిలోకి కౌర్‌ను పిలిచి, ఆమెను అరెస్టు చేస్తున్నట్లు చెప్పారని ఆమె తెలిపింది. కౌర్‌కు తన న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడే అవకాశం కల్పించినప్పటికీ, ఆమెను నిర్బంధంలోనే ఉంచారని ఆమె కుమార్తె చెప్పింది. కొన్ని గంటల పాటు కౌర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారో కుటుంబ సభ్యులైన తమకు తెలపకుండానే,  రాత్రికి రాత్రే అడెలాంటోకు బదిలీ చేశారని ఆరోపించారు. మరోవైపు అమెరికా పౌరురాలైన ఆమె మరో కుమార్తె, గ్రీన్ కార్డ్ ఉన్న ఆమె భర్త నుండి ఆమోదించబడిన గ్రీన్ కార్డ్ హోదాలో ఉన్నారని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ తన  కథనంలో వివరించింది.


ఎవరీ బబ్లీ కౌర్ 
కౌర్ కుటుంబం USకి వలస వచ్చిన తర్వాత,  మొదట లగున బీచ్‌లో స్థిరపడ్డారు, తర్వాత లాంగ్ బీచ్‌కు వెళ్లారు.  తరువాత ఉద్యోగ బాధతలరీత్యా బెల్మాంట్ షోర్ ప్రాంతానికి  మారారు. కౌర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. 34 ఏళ్ల జోతి, DACA (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హుడ్ అరైవల్స్) కింద USలో చట్టపరమైన హోదాను కలిగి ఉన్నారు ,ఆమె అన్నయ్య, సోదరి, ఇద్దరూ  అమెరికా పౌరులుగా  ఉన్నారు.

రెండు దశాబ్దాలకు పైగా, కౌర్ , ఆమె భర్త బెల్మాంట్ షోర్‌లోని 2వ వీధిలో నటరాజ్ క్యూసిన్ ఆఫ్ ఇండియా అండ్ నేపాల్ అనే తినుబండారాల ఔట్‌లెట్‌ను నిర్వహిస్తున్నారు. లాంగ్ బీచ్ కమ్యూనిటీలో మంచి  ఆదరణను కూడా పొందింది. అయితే ఈ ఏడాది  ప్రారంభంలో ఫార్మసీ చైన్ దాని మిగిలిన స్థానాలను మూసివేసేంs వరకు ఆమె బెల్మాంట్ షోర్ రైట్ ఎయిడ్‌లో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసింది. ఇటీవల, ఆమె రాయల్ ఇండియన్ కర్రీ హౌస్‌లో రెస్టారెంట్ పనిలోకి రావడానికి తిరిగి సిద్ధమవుతోంది.

బబ్లీ కౌర్‌ను విడుదల చేయాలని పిలుపు
లాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా, కౌర్ విడుదల కోసం పిలుపునిచ్చారు. ఆమె కుటుంబం ఆమె కేసు కొనసాగుతున్నందున కౌర్‌ను బాండ్‌పై విడుదల చేయడానికి అనుమతించే అదనపు చట్టపరమైన దాఖలును సిద్ధం చేస్తున్నందున, ఈ విషయంపై అతను ఫెడరల్ అధికారులతో సంప్రదింపులు జరుపు తున్నట్లు  ఆయన సిబ్బంది తెలిపారు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)