Breaking News

గ్రీన్‌కార్డులపై గూగుల్‌ గుడ్‌న్యూస్‌

Published on Wed, 12/24/2025 - 07:12

వాషింగ్టన్‌: అమెరికాలో హెచ్‌–1బీ వీసాతో గూగుల్‌ సంస్థలో పని చేస్తున్నవారికి శుభవార్త. వారి గ్రీన్‌కార్డు కలలకు త్వరలోనే మోక్షం లభించనుంది. తమ ఉద్యోగుల గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌ ప్రక్రియను వచ్చే ఏడాది వేగవంతం చేయబోతున్నట్లు గూగుల్‌ యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత ఉద్యోగులకు సమాచారం చేరవేసింది.

అమెరికాలో వేలాది మంది విదేశీయులు తాత్కాలిక వీసాలతో గూగుల్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కంపెనీ స్పాన్సర్‌షిప్‌తో శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు) పొందాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. నిజానికి వారికి గత రెండేళ్లుగా గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అర్హులైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డులు లభించడానికి వీలుగా ప్రోగ్రామ్‌ ఎల్రక్టానిక్‌ రివ్యూ మేనేజ్‌మెంట్‌(పెర్మ్‌) దరఖాస్తులు స్వీకరించడంతోపాటు వాటికి ప్రభుత్వం నుంచి త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టబోతున్నట్లు గూగుల్‌ యాజమాన్యం తెలియజేసింది. ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు పొందడంలో పెర్మ్‌ అనేది కీలకమైన ప్రక్రియ.

అమెరికాలోని టెక్నాలజీ కంపెనీలు ఈ ప్రక్రియను విస్తృతంగా వాడుకుంటాయి. టెంపరరీ వర్క్‌ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు పరి్మనెంట్‌ రెసిడెన్సీ స్టేటస్‌ వచ్చేలా సహకరిస్తాయి. పెర్మ్‌కు అర్హులైన వారికి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో గ్రీన్‌కార్డు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీనిపై గూగుల్‌ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతర్గతంగా సమాచారం మాత్రం ఇచి్చంది.

విదేశీ ప్రయాణాలు ఇప్పుడే వద్దు.. ఉద్యోగులకు అమెరికా టెక్‌ కంపెనీల సూచన  
అమెరికాలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్‌ వంటి దిగ్గజ టెక్‌ కంపెనీలు వర్క్‌ వీసాలపై పని చేస్తున్న తమ ఉద్యోగులకు కీలక సూచన జారీ చేశాయి. విదేశీలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాయిదా వేసుకోవాలని తెలియజేశాయి. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడే వద్దని పేర్కొన్నాయి. విదేశాల్లోని అమెరికా ఎంబీసీలు, కాన్సులేట్లలో వీసా స్టాంపింగ్‌ చాలా ఆలస్యమవుతోంది. నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు ఏడాది కాలం పడుతోందని చెబుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిరావడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని టెక్‌ కంపెనీలు సూచించాయి. ఈ మేరకు కొన్ని రోజులుగా తమ ఉద్యోగులకు సమాచారం అందిస్తున్నాయి. 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)