Breaking News

200 ఏ‍ళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..

Published on Mon, 08/07/2023 - 09:23

ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో చోటుచేసుకుంది. 

ది సన్‌ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్‌ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్‌ రూమ్‌ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్‌ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు.

నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది.  

ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు.  నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. 
ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్‌ మరో వింత వ్యాఖ్యానం!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)