Breaking News

కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్‌.. ఎందుకంటే!

Published on Sat, 09/09/2023 - 13:42

G20 Summit In India: భారత్ అధ్యక్షతన తొలిసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్‌ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

కాగా  జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఓలాఫ్  స్కోల్జ్‌కు.. భార‌త మండ‌పంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద  ప్ర‌ధాని మోదీ కరచలనం చేసి స్వాగ‌తం ప‌లికారు. ఆ స‌మ‌యంలో స్కోల్జ్‌.. త‌న కంటికి ఐప్యాచ్ ధ‌రించి ఉన్నారు. సాధార‌ణంగా కంటి ఆప‌రేష‌న్ చేయించుకున్న వాళ్లు ధ‌రించే న‌ల్ల రంగు ప్యాచ్‌ను స్క‌ల్జ్ త‌న కంటికి ధ‌రించారు.

అయితే దీనిపై జర్మనీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్స‌ల‌ర్ గ‌త శనివారం జాగింగ్ చేస్తుండగా స్వల్ప గాయాలైనట్లు అతని ప్ర‌తినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్  తెలిపారు. దీని వ‌ల్ల ఆయ‌న కుడి క‌న్ను దెబ్బ‌తిందని, మరి కొన్ని రోజులు కంటికి ప్యాచ్‌ ధరించాల్సి ఉంటుందని చెప్పారు. జర్మనీ ఛాన్సలర్‌కు ఎన్నో ఏళ్లుగా ప్ర‌తి రోజూ జాగింగ్ చేసే అల‌వాటు ఛాన్స‌ల‌ర్ స్క‌ల్జ్‌కు ఉన్న‌ట్లు తెలిపారు. 
చదవండి: G20 Summit: కీలక ఒప్పందాలపై అగ్రనేతల చర్చలు 

అంతేగాక నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్‌ 4న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్‌ సైతం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తనక కంటికి గాయమైన ఫోటోను షేర్‌ చేవారు. ఇందులో అతడి కుడి కన్నుపై పెద్ద నల్లటి పాచ్ ధరించి ఉన్నారు. కంటి చుట్టూ ఎర్రగా దెబ్బ తగిలిన గుర్తులుకూడా కనిపిస్తున్నాయి.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)