Breaking News

Gaza: ప్రాణ భయంతో.. ఉరుకులు పరుగులు!

Published on Fri, 10/13/2023 - 20:08

వైమానిక దాడులతో గాజాను ఛిద్రం చేసిన ఇజ్రాయెల్‌ బలగాలు.. ఇక భూభాగంపై దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే గాజా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో గాజా ప్రజలు ప్రాణాలు గుప్పిట పట్టుకుని భయంతో పరుగులు తీస్తున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

బట్టలు, పరుపులు కార్ల పైభాగానికి కట్టుకుని.. ఇంతకాలం తమను ఆశ్రయం ఇచ్చిన నేలను వదిలేసి పారిపోతున్నారు గాజా ప్రజలు. కాలినడకన, దొరికిన వాహనం పట్టుకుని వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తు‍న్నాయి. ఈ ఫొటోలు, వీడియోలు నార్త్‌ గాజాకు చెందినవిగా పాలస్తీనాకు చెందిన ఓ రిపోర్టర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.  

హమాస్‌ సంస్థను నామారూపాలు లేకుండా చేస్తామని శపథం చేసిన ఇజ్రాయెల్‌.. రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో బలగాలతో గాజాపై విరుచుకుపడేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అదే జరిగితే.. గాజాలో ప్రాణ నష్టం ఊహించని స్థాయిలో ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐక్యరాజ్య సమితి. 

‘‘గాజా నగర పౌరులారా.. మీరు, మీ కుటుంబాలు భద్రంగా ఉండాలంటే ఖాళీ చేసి వెళ్లిపోండి. హమాస్‌ ఉగ్రవాదులకు మీరు దూరంగా ఉండండి. మిమ్మల్ని వాళ్లు రక్షణ కవచంగా వాడుకుంటున్నారు’’ అని ఇజ్రాయెల్‌ మిలిటరీ తన హెచ్చరిక ప్రకటనలో పేర్కొంది. గాజాలో జనావాసాల్లో హమాస్‌ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు మొదటి నుంచి ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. 

మరోవైపు గాజా ప్రజల్ని తరలిపోవాలన్న ఇజ్రాయెల్‌ అల్టిమేటంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అది మరింత వినాశనానికి దారి తీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇజ్రాయెల్‌ హెచ్చరికలపై స్పందిస్తూ.. గాజా ఆస్పత్రుల్లో ఉన్న పేషెంట్ల తరలించడం సాధ్యం కాదన్న విషయాన్ని అక్కడి అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని అంటోంది. ముఖ్యంగా ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్లను తరలించడం వీలయ్యేది కాదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్‌ జసరెవిక్‌ తెలిపారు. 

1948లో ఇజ్రాయెల్‌ ఏర్పాటు తర్వాత వేరు ప్రాంతంగా ఏర్పాటైనా గాజాలో.. 20 లక్షల కంటే ఎక్కువ జనాభానే ఉంది. అందులో శరణార్థులే ఎక్కువగా ఉన్నారు. గత 16 ఏళ్లుగా హమాస్‌ పాలనలో.. ఇజ్రాయెల్‌ దాడులు ఒకవైపు, మరోవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గాజా స్ట్రిప్‌ ఎదుర్కొంటోంది.  ఇక.. గత శనివారం(అ‍క్టోబర్‌ 7) హమాస్‌.. ఇజ్రాయెల్‌ భూభాగంపై మెరుపు దాడికి దిగింది. కేవలం 20 నిమిషాల్లో.. ఐదువేల రాకెట్‌ లాంఛర్లను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయెల్‌ కూడా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 1,300 ఇజ్రాయెల్‌ పౌరులు, 1800 దాకా పాలస్తీనియన్లు మృతి చెందారు. 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)