Breaking News

ఇంగ్లండ్‌ తీరంలో రెండు నౌకలు ఢీ

Published on Tue, 03/11/2025 - 04:56

లండన్‌: ఇంగ్లండ్‌ తూర్పు తీరంలో ఆయిల్‌ ట్యాంకర్, సరుకు నౌక ఢీకొన్న ఘటనలో రెండు ఓడలకు మంటలు అంటుకున్నాయి. హల్‌ తీరానికి సమీపంలో సోమవారం ఉదయం 9.48 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. రెండు నౌకల్లోని మొత్తం 37 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చినట్లు రవాణా శాఖ మంత్రి తెలిపారని స్థానిక ప్రజా ప్రతినిధి గ్రాహం స్టువార్ట్‌ చెప్పారు. వీరిలో తీవ్రగాయాలతో ఉన్న ఒకరిని ఆస్పత్రిలో చేర్పించారన్నారు. 

గ్రీస్‌ నుంచి వచ్చిన అమెరికాకు చెందిన ఎంవీ స్టెనా ఇమాక్యులేట్‌ పేరున్న ఆయిల్‌ ట్యాంకర్‌ గ్రీమ్స్‌బీ పోర్టులో లంగరేసి ఉంది. అదే సమయంలో, స్కాట్లాండ్‌ నుంచి నెదర్లాండ్స్‌లోని పోటర్‌డ్యామ్‌ వైపు వెళ్తున్న పోర్చుగల్‌ సరుకు నౌక సొలొంగ్‌ దానిని ఢీకొట్టింది. దీంతో, రెండు ఓడల్లో మంటలు చెలరేగాయి. సరుకు ఓడలో సోడియం సైనైడ్‌ అనే విషపూరిత రసాయన కంటెయినర్లు ఉన్నట్టు సమాచారం. బ్రిటన్‌ మారిటైం కోస్ట్‌గార్డ్‌ ఏజెన్సీ ఆ ప్రాంతానికి లైఫ్‌బోట్లను, రెస్క్యూ హెలి కాప్టర్‌ను పంపించింది. 

నౌకల్లో నుంచి బయటకు దూకిన వారిని లైఫ్‌బోట్లలో రక్షించి ఒడ్డుకు చేర్చారు.  కాగా, స్టెనా ఇమాక్యులేట్‌ ఓడలో జెట్‌–ఏ1 ఇంధనం రవాణా అవుతోందని అమెరికాకు చెందిన మారిటైం మేనేజ్‌మెంట్‌ సంస్థ క్రౌలీ తెలిపింది. సరుకు నౌక ఢీకొట్టడంతో ట్యాంకర్‌ దెబ్బతిని ఇంధనం లీకైంది. దీంతో మంటలు వ్యాపించడంతోపాటు పలుమార్లు పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. ట్యాంకర్‌ నౌకలో ఉన్న మొత్తం 23 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు క్రౌలీ వివరించింది. అమెరికా సైన్యానికి అవసరమైన ఇంధనాన్ని ఈ సంస్థ సరఫరా చేస్తుంది. 
 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)