Breaking News

ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో అబార్షన్‌ బిల్లుకు ఆమోదం!

Published on Tue, 03/05/2024 - 06:57

ఫ్రాన్స్‌ పార్లమెంట్‌లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్‌ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్‌  రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు.  

అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.  దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది.

ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్‌ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్‌ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.

మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)