Breaking News

French elections 2024: ఫ్రాన్స్‌ రెండో దశలో... రికార్డు పోలింగ్‌

Published on Mon, 07/08/2024 - 04:46

పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఆదివారం కీలకమైన రెండో దశలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదుగంటలకు 59.7 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. 1981 తర్వాత ఇంతటి పోలింగ్‌ నమోదవడం ఇదే తొలిసారి. జూన్‌ 30వ తేదీన జరిగిన తొలి రౌండ్‌లో 67 శాతం పోలింగ్‌ జరిగింది. 

ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ జూన్‌ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలైనా, పార్లమెంటు ఎన్నికలైనా రెండు దశల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన రెండో దశ కీలకమైనది. మాక్రాన్‌ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉంది. 

ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల ఫలితాల వల్ల ఆయన పదవికి తక్షణ ప్రమాదం ఏమీ లేకున్నా, చట్టాలు చేసేటప్పుడు పార్లమెంటులో అడుగడుగునా పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌కు తొలిరౌండ్‌లో చేదు అనుభవం ఎదురైన విషయం తెల్సిందే. మేక్రాన్‌కు చెందిన మితవాద సెంట్రిస్ట్‌ ఎన్‌సింబల్‌ కూటమి మూడో స్థానంలో సరిపెట్టుకుంది. 

తొలి రౌండ్‌లో అతివాద నేషనల్‌ ర్యాలీ కూటమి 33.14 శాతం ఓట్లను ఒడిసిపట్టి విజయం సాధించింది. విపక్షాలకు చెందిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ కూటమి 27.99 శాతం ఓట్లను సాధించింది. మేక్రాన్‌ పార్టీ కేవలం 20.04 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఇటీవల యురోపియన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో నాయకురాలు మెరీన్‌ లీ పెన్‌కు చెందిన నేషనల్‌ ర్యాలీ పార్టీ విజయం సాధించింది. ఆలస్యం చేస్తే విపక్షాలు మరింత పుంజుకుంటాయన్న భయంతో మేక్రాన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం విదితమే. 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)