France: బుర్ఖా నిషేధంపై రగడ

Published on Mon, 08/28/2023 - 12:03

ప్యారిస్: ఫ్రాన్స్ స్కూళ్లలో ముస్లిం విద్యార్థులు ధరించే బుర్ఖా(అబయ)లను నిషేధించనున్నారు. పాఠశాలల్లో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఈ వస్త్రధారణ ఉందని ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమలులోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు.

'లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానం. బుర్ఖా(అబయ)లు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయి. దీనివల్ల ఫ్రాన్స్‌ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతుంది. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఎంటో చెప్పేలా ఉండకూడదు.' అని గాబ్రియేల్ అట్టల్ తెలిపారు. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే ఎలాంటి దుస్తులను ధరించకూడదని పేర్కొనడాన్ని ఆయన గుర్తు చేశారు.       

పాఠశాలల్లో బుర్ఖా(అబయ) ధరించే సాంప్రదాయం క్రమంగా పేరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధనలకు ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి. 

పాఠశాలల్లో ఇస్లామిక్ బుర్ఖా(అబయ)లను నిషేధించాలనే వాదనలు ఫ్రాన్స్‌లో కొద్దిరోజులుగా తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే.. వామపక్షవాదులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ముస్లిం సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మతపరమైన గుర్తులంటే కేవలం వేషధారణ మాత్రమే కాదని అంటున్నాయి. ఇతర వస్తువులు కూడా మతపరమైన గుర్తులను సూచిస్తాయని చెబుతున్నాయి. కానీ ప్రతిపక్ష రైట్ వింగ్ రిపబ్లికన్ పార్టీ అధినేత ఎరిక్ సియోట్టో ప్రభుత్వ విధానాలకు స్వాగతం పలికారు. 

ఇదీ చదవండి: ప్రిగోజిన్ మృతి చెందాడా..? రష్యా జన్యు పరీక్షల్లో ఏం తేలింది..?

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)