Breaking News

రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..    

Published on Mon, 07/03/2023 - 15:46

పారిస్: ఫ్రాన్స్ దేశంలో నహేల్ అనే ఒక 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చి చంపడంతో ఫ్రాన్స్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. వారం రోజులవుతున్నా ఇప్పటికింకా అక్కడ ఉద్రిక్తత తగ్గుముఖం పట్టలేదు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చిన ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతూ, దుకాణాలను లూటీ చేస్తున్నారు. తాజాగా కొన్ని అల్లరి మూకలు ఒక కార్ షోరూంని కొల్లగొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 

సంఘటన జరిగిన రోజు నుండి నేటివరకు ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తూ భగ్గుమంటూనే ఉంది. ఇంతవరకు ఈ అల్లర్లలో సుమారు 1000 మందిని పోలీసులు అరెస్టు చేయగా పోలీసు బలగాల్లో 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోకుండా అడ్డుకునేందుకు 45000 మంది పోలీసులు పహారా కాస్తూ అల్లరిమూకలను చెదరగొడుతున్నా ఆకతాయిల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.   

ఇదిలా ఉండగా ఆందోళనకారులు పారిస్ నగరంలో ఎక్కడికక్కడ దుకాణాల్లోకి చొరబడి చేతికి దొరికిన వస్తువును తీసుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కొంతమంది నిరసనకారులు అక్కడి వోక్స్ వ్యాగన్ కార్ షోరూంని కొల్లగొట్టి అందులోని ఖరీదైన కార్లను దొంగిలించారు. ఎంత కష్టపడితే మాత్రం ఇలాంటి లగ్జరీ కార్లను కొనడానికి జీవితకాలం సరిపోదని భావించారో ఏమో. షోరూంలోనో కార్లన్నిటినీ లూటీ చేశారు. 

దుండగులు కార్లను ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనికి కామెంట్ల రూపంలో ఆందోళనకారులు దుకాణాలను లూటీ చేస్తోన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు వీక్షకులు.    

ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)