Breaking News

జర్మనీ పర్యాటకుణ్ణి దోచుకున్న పాక్‌ పోలీసులు

Published on Thu, 08/08/2024 - 08:47

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అక్కడ సాధారణ పౌరులకు కూడా భద్రత లేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక విదేశీ పర్యాటకుల సంగతి చెప్పనవసరం లేదు. పాకిస్తాన్‌లో  జరిగిన ఓ లూటీ  సంచలనంగా మారింది.

జర్మనీకి చెందిన పర్యాటకుడు బెర్గ్ ఫ్లోరిన్ పాకిస్తాన్‌ను సందర్శించేందుకు వచ్చాడు. అయితే అతని దగ్గరున్న విలువైన వస్తువులను  ఎవరో దోచుకెళ్లడంలో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును టేకప్‌ చేసిన పోలీసులకు ఒక విషయం తెలిసే సరికి వారు తెగ ఆశ్చర్యపోయారు. ఈ కేసులో లాహోర్ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురిలో.. నలుగురు పోలీసులు ఉన్నారని తెలియడంతో వారు కంగుతిన్నారు.

వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన 27 ఏళ్ల బెర్గ్ ఫ్లోరిన్ వారం రోజులుగా లాహోర్ విమానాశ్రయానికి సమీపంలో క్యాంప్ వేసుకుని ఉంటున్నాడు. కొంతమంది దుండగులు ఆయుధాలతో బెదిరించి, ఫ్లోరిన్ దగ్గర నుంచి  ఖరీదైన మొబైల్‌ పోన్‌తో పాటు కెమెరాను దోచుకెళ్లారు. దీనిపై లాహోర్ పోలీసులకు ఫ్లోరిన్ ఫిర్యాదు చేశాడు. తాను సైకిల్‌పై పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నట్లు ఫ్లోరిన్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 3వ తేదీన రాత్రి రోడ్డు పక్కనే టెంట్ వేసుకున్నానని, ఈ సమయంలో కొందరు  ఆయుధాలతో తన దగ్గరకు వచ్చి తన విలువైన్‌ ఫోను, కెమెరాను లాక్కెళ్లి పోయారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ విదేశీ పౌరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఆ జర్మన్ పౌరుడిని దోచుకున్న నిందితులను అరెస్టు చేసినట్లు లాహోర్ పోలీస్ చీఫ్ బిలాల్ సిద్ధిఖీ కమ్యానా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దోపిడికీ పాల్పడినవారితో జతకట్టిన నలుగురు పోలీసులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే వారికి మిగిలిన దోపిడీ దొంగలతో సంబంధం ఉందా లేదా అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి