Breaking News

జిమ్మీ కార్టర్‌ అస్తమయం

Published on Mon, 12/30/2024 - 07:49

వాషింగ్టన్‌: అమెరికా 39వ అధ్యక్షుడు, డెమొక్రటిక్‌ నేత జిమ్మీ కార్టర్‌ ఇక లేరు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జార్జియా రాష్ట్రంలో ప్లెయిన్స్‌లోని తన నివాసంలో ఆదివారం ప్రశాంతంగా కన్నుమూశారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యధిక కాలం జీవించిన రికార్డు ఆయనదే. 1977–81 మధ్య అధ్యక్షునిగా చేసిన కార్టర్‌ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు దేశాధినేతలు కార్టర్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నాయకత్వ పటిమ తిరుగులేనిదని బైడెన్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వానికి, సానుకూల దృక్పథానికి కార్టర్‌ ప్రతిరూపమని కొనియాడారు. కార్టర్‌ అంత్యక్రియలను జనవరి 9న పూర్తి అధికార లాంఛనాలతో జరపనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా కార్టర్‌తో తాను తీవ్రంగా విభేదించినా ఆయన నిష్కళంక దేశభక్తుడన్నది నిస్సందేహమని ట్రంప్‌ పేర్కొన్నారు. కార్టర్‌ అంత్యక్రియలు స్వగ్రామంలో ఆయనకెంతో ఇష్టమైన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే జరిగే అవకాశముంది. 

రైతు బిడ్డ 
జిమ్మీ కార్టర్‌గా ప్రసిద్ధుడైన జేమ్స్‌ ఎర్ల్‌ కార్టర్‌ జూనియర్‌ ఓ నికార్సైన రైతు బిడ్డ. 1924 అక్టోబర్‌ 1న జార్జియాలోని ప్లెయిన్స్‌ అనే చిన్న పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి కార్టర్‌ సీనియర్‌ ఓ రైతు. తల్లి లిలియన్‌ నర్సు. 1943లో అమెరికా నావల్‌ అకాడమీలో క్యాడెట్‌గా ఆయన కెరీర్‌ మొదలైంది. దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడమే గాక ప్రతిష్టాత్మక అణు జలాంతర్గామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 1962లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్‌ అయ్యారు. 1974లోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

 అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ రాజీనామాకు దారితీసిన వాటర్‌గేట్‌ కుంభకోణం నుంచి అమెరికా అప్పటికింకా బయట పడనే లేదు. 1977 ఎన్నికల్లో నెగ్గి అమెరికా అధ్యక్షుడయ్యారు. 1979లో ఈజిప్టు, ఇజ్రాయెల్‌ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందంలో కీలకపాత్రధారిగా నిలిచారు. చైనాతో అమెరికా దౌత్య సంబంధాలకు తెర తీసిన అధ్యక్షునిగా నిలిచిపోయారు. మానవ హక్కులే మూలసూత్రంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరి్నర్వచించారు. అయితే అఫ్గానిస్తాన్‌పై సోవియట్‌ యూనియన్‌ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇరాన్‌ బందీల సంక్షోభమూ కార్టర్‌ చరిత్రపై ఓ మచ్చగా మిగిలింది. 

డజన్ల కొద్దీ అమెరికన్లను ఇరాన్‌ తిరుగుబాటు విద్యార్థులు బందీలుగా చేసుకోవడం స్వదేశంలో ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. 1980 ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి రొనాల్డ్‌ రీగన్‌ చేతిలో ఓటమి చవిచూశారు. అలా వైట్‌హౌస్‌ను వీడినా కార్టర్‌ ప్రజాసేన మాత్రం నిరి్నరోధంగా కొనసాగింది. అమెరికా ప్రభుత్వం తరఫున ఉత్తర కొరియాకు శాంతి స్థాపన బృందాన్ని తీసుకెళ్లారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు చేసిన నిరి్వరామంగా కృషికి నోబెల్‌ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య రోసలిన్‌ ఏడాది క్రితమే మరణించారు.

 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)