మాజీ యువరాజు ఆండ్రూ విడుదల 

Published on Sat, 02/21/2026 - 04:23

లండన్‌: సెక్స్‌ రాకెట్‌ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలతోపాటు అధికార దుర్వినియోగం, దు్రష్పవర్తన కేసులో అరెస్టయిన బ్రిటన్‌ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్‌–విండ్సర్‌ శుక్రవారం విడుదలయ్యారు. థేమ్స్‌ వ్యాలీ పోలీసులు ఆయనను 11 గంటలపాటు ప్రశ్నించారు. విడుదలైన అనంతరం ఆండ్రూ నార్‌ఫోక్‌లోని వుడ్‌ఫామ్‌ హోమ్‌కు చేరుకున్నారు. మరోవైపు అండ్రూపై దర్యాప్తు కొనసాగుతోంది. 

విండ్సర్‌ రాజప్రాసాదంలో ఆయన గతంలో నివాసం ఉన్న రాయల్‌ లాడిŠజ్‌లో పోలీసులు శుక్రవారం సైతం సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ కీలక సమాచారాన్ని, కొన్ని ట్రేడ్‌ రిపోర్టులను ఎప్‌స్టీన్‌కు చేరవేసిన కేసులో ఆండ్రూను గురువారం ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 66వ పుట్టిన రోజునాడే అరెస్టయ్యారు. ఆండ్రూకు సంబంధించిన ఒక నివాసంలో సోదాలు పూర్తయ్యాయని, మరో నివాసంలో ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. 

గత కొన్ని శతాబ్దాల్లో బ్రిటిష్‌ రాజకుటుంబంలో ఒక సభ్యుడు అరెస్టు కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చివరిసారిగా 1554లో అప్పటి రాణి ఎలిజబెత్‌–1(ఎలిజబెత్‌ ట్యూడర్‌) తోబుట్టువు అరెస్టయ్యారు. మరోవైపు అధికార దుర్వినియోగం కేసులో మాజీ యువరాజు ఆండ్రూపై ఆరోపణలు రుజువైతే కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అరెస్టు తర్వాత ఆండ్రూ ఇంకా స్పందించలేదు.    

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)