నిరసనల ఎఫెక్ట్‌.. నేపాల్‌ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన

Published on Mon, 09/29/2025 - 11:45

ఖాట్మాండ్‌: నేపాల్‌(Nepal) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.

నేపాల్‌ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా మాట్లాడుతూ.. నేను ఎవరికీ భయపడను. దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాను. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్‌ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదే సమయంలో  ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు మెసేజులు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేపాల్‌లో అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా ఇటీవల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్‌-జీ(Gen Z) ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)